ఈ అమ్మమ్మకు శుభాకాంక్షలేవి...లోకేష్‌కి లక్ష్మీ పార్వతి ప్రశ్న...అసలు మతలబు ఏంటి?

Publish Date:Apr 20, 2026

Advertisement

 

లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది. కొందరు ఏమన్నారంటే, లోకేష్,, నానమ్మ అమ్మణ్ణమ్మ, తాతయ్య ఖర్జూర నాయుడుకి కూడా ఇలాగే విషెస్ పెట్టాలని కొందరు. మరి కొందరు.. లోకేష్ ఇదే విజయమ్మను గతంలో విజయ విజయ అంటూ గౌరవం లేకుండా మాట్లాడారనీ.. ఇప్పుడు విజయమ్మ అంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమేంటని గత ట్వీట్లు కూడా తిరగదోడి మరీ కామెంట్లు చేశారు.

ఫైనల్ గా రంగంలోకి దిగారు లక్ష్మీపార్వతి. విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పే స్థాయి నీకుందా? అని లోకేష్‌ని  అడుగుతూ.. చాలానే మాటలు మాట్లాడారు. మొన్న మీరు గెలిచింది ఒక గెలుపే కాదు. అన్నీ అడ్డదారులంటూ అవాకులు చెవాకులు మాట్లాడిన లక్ష్మీ పార్వతి చివరాఖర్లో ఒక బాంబు పేల్చారు. మీ అమ్మమ్మను నేను ఉన్నాను. నాకు ఎప్పుడైనా విషెస్ చెప్పావా? అంటూ నిలదీశారామె.

ఏమాటకామాట లోకేష్ విజయమ్మకు పుట్టిన రోజుల శుభాకాంక్షలు చెప్పడంలో ఒక రాజకీయ కోణం ఉన్న మాట నిజమే. ఆమె తన కొడుకు జగన్‌తో  గొడవలేం ఖర్మ ఏకంగా కోర్టు కేసుల్లో ఉన్నారు. తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన జగన్ కాస్తా ఆ రోజు.. ముక్కు సర్జరీ చేయించుకున్న  పవన్‌పై  పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఒక ట్వీట్ చేశారు. 2024 వరకూ తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వచ్చిన జగన్ గత రెండేళ్లుగా అమ్మను మరచి పోయారు. ఈ విషయం గుర్తు చేస్తూ లోకేష్ విజయమ్మ ను కూడా తన అమ్మగా భావించి.. విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. 

ఏ మాటకామాట జగన్ కి పవన్ కి పెద్దగా పడేది కాదు. గత కొన్నాళ్లుగా ఆయన్ను జగన్ దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్ల వాడంటూ మాట్లాడేవారు. అలాంటి పవన్ మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చిన జగన్ తన తల్లిని కూడా మరచి ఆయన వెంటనే కోలుకోవాలంటూ.. ట్వీట్ చేయడం చాలా మందికి షాకింగా అనిపించింది. గతంలో వైసీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించింది అనే మాట కూడా చెలామణిలో ఉంది. ఈ విషయం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్న మాట నిజం. అయితే ఇదంతా జగన్ కి ఏమంత ఇష్టం లేదు. అంతా కేంద్ర బీజేపీ నాయకత్వం చేసిన యత్నంగా చెబుతారు కొందరు వైసీపీ మద్దతుదారులు. అంత ఇష్టం లేని వ్యక్తి తల్లికన్నా ఎక్కువ ఎలా అవుతారన్నది ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్

ఈ పాయింట్‌ని  ఇన్ డైరెక్టుగా హైలెట్ చేస్తూ జగన్ సోదరి షర్మిళ సైతం ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆమె జగన్ కేంద్రానికి దత్తపుత్రుడిగా మారిపోయారంటూ చేసిన కామెంట్లను అలా ఉంచితే.. తన తల్లి తనకు ఎంతో అండగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇదే అంశాన్ని లోకేష్ సైతం టచ్ చేస్తూ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం జగన్ని బాగా ఇరుకున పెట్టిన అంశంగా మారింది. దీన్నుంచి టాపిక్ డైవర్షన్ చేసే బాధ్యతలను ఆ ఇంటికి కాస్త రిలేషన్  గల లక్ష్మీపార్వతిని రంగంలోకి దించారు వైసీపీ వ్యూహకర్తలు. కట్ చేస్తే ఆమె తనకున్న వేలువిడిచిన అమ్మమ్మ బంధుత్వాన్ని బయటకు లాగి.. ఇదిగో ఇలా అమ్మమ్మ అనే రిలేషన్ ని గుర్తు చేసి తద్వారా.. లోకేష్ ని ఇరుకున పెట్టాలన్న యత్నం చేశారని అంటారు కొందరు విశ్లేషకులు.
 

By
en-us Political News

  
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది.
ప్రముఖ కన్వెన్షన్ వ్యాపారవేత్త శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు.
ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాలు.
భారత ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేది దేశీయ వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, గత కొన్ని సంవత్సరాల్లో బలపడ్డ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు. 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6శాతం వృద్ధి తరువాత కూడా, భారత్ బలమైన స్థితిలోనే ప్రపంచ అనిశ్చితిలోకి ప్రవేశిస్తోందని అధ్యయనం పేర్కొంది.
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.