Publish Date:Apr 20, 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన హార్థిక్ పాండ్యా సేన కీలక విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డికాక్ (13), మలేవార్ (2)తో పాటు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (15) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును యువ సంచలనం తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. నమన్ ధీర్ సహకారంతో ఇన్నింగ్స్ నిర్మించిన తిలక్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నమన్ ధీర్ 45 పరుగులు చేశాడు. తిలక్ మర్మ అయితే.. కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది.
200 పరుగుల భారీ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సాయి సుదర్శన్‌ను డకౌట్ చేయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో తన తొలి వికెట్ సాధించాడు. . ఆ తర్వాత అశ్వని కుమార్ తన బౌలింగ్ పదును చూపిస్తూ గుజరాత్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన గుజరాత్, కనీస పోరాటం కూడా ప్రదర్శించలేకపోయింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్14 పరుగులు, జోస్ బట్లర్ 5 పరుగులు నిరాశపరచడంతో గుజరాత్ పతనం వేగవంతమైంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, సాంట్నర్, గజన్ఫర్ చెరో రెండు వికెట్లు తీశారు.
వరుసగా నాలుగు ఓటముల తర్వాత దక్కిన ఈ విజయం ముంబై ఇండియన్స్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా బుమ్రా వికెట్ల ఖాతా తెరవడం, తిలక్ వర్మ భీకర ఫామ్‌లోకి రావడం జట్టుకు సానుకూలాంశం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mumbay-indians-defeat-gujarat-titans-36-217835.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.