చమురు తుపానులోనూ తగ్గని భారత్ వృద్ధి!

Publish Date:Apr 21, 2026

Advertisement

ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ   స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. మధ్యప్రాచ్యంలో  నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల,  అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో సైతం  కనిపిస్తున్న ఆర్థిక మందగమనం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ మాత్రం తన వృద్ధిని నిలకడగా కొనసాగిస్తోంది.  తాజాగా విడుదలైన ఎస్బీఐ (SBI) అధ్యయన నివేదిక ప్రకారం..  2027 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ జిడిపి  వృద్ధి రేటు 6.8 నుంచి 7.1 శాతం వరకూ ఉంటుంది.  భారత ఆర్థిక వ్యవస్థ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ స్థిరంగా, పటిష్ఠంగా నిలబడటానికి ప్రధాన కారణం దేశంలోని ధృఢమైన అంతర్గత పునాదులే. దేశీయంగా పెరిగిన వినియోగం, పటిష్టమైన బ్యాంకింగ్ రంగం,   గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడటం భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. 2 026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధిని సాధించిన తరువాత కూడా.. ఇండియాకు  అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోగల సత్తా  ఉందని ఈ నివేదిక  స్పష్టం చేస్తున్నది. 

అయినప్పటికీ, ముడిచమురు ధరల పెరుగుదల అనేది భారత్‌కు తక్షణ ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఎస్ అండ్ పీ  గ్లోబల్ రేటింగ్స్ అంచనా ప్రకారం..  ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర 130 డాలర్లకు చేరితే, అది భారత వృద్ధి రేటుపై   0.8 శాతం వరకు ప్రభావం చూపవచ్చు. అదే అంతర్జాాతీయ మార్కెట్ లో బ్యారెల్ చమురు ధర 140 డాలర్లను దాటితే.. ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా కరెంట్ అకౌంట్ లోటు, కంపెనీల లాభాలపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది.  ఇది రవాణా, ఎరువులు, తయారీ, విమానయాన రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.  

 గతంలో చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లడం మనం చూశాం. అయితే ఈసారి అమెరికా పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం  ఆ దేశం ప్రస్తుతం ఇంధన ఎగుమతిదారుగా ఎదగడమే. అయినా కూడా పెరిగిన ధరలు అక్కడి వినియోగదారులపై భారాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో వచ్చే మార్పులు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.  ప్రస్తుత తరుణంలో  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు వృద్ధిని కాపాడుకుంటూనే, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాలు. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం 4.5 శాతం వద్ద, ద్రవ్యలోటు 4.5 నుంచి 4.6 శాతం మధ్య ఉండొచ్చని అంచనా. రూపాయి విలువ పడిపోకుండా స్థిరత్వాన్ని కొనసాగించడం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం. 

సంక్షోభ సమయాల్లో కూడా కొన్ని కొత్త అవకాశాలు పుట్టుకొస్తుంటాయి. మధ్యప్రాచ్యంలోని దుబాయ్, అబుదాబి వంటి ఆర్థిక కేంద్రాలు ఒత్తిడికి లోనవుతుంటే..  ఆ పెట్టుబడులను ఆకర్షించడానికి గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ (గిఫ్ట్ సిటీ) వంటి వేదికలు భారత్‌కు సిద్ధంగా ఉన్నాయి.  అదేవిధంగా, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత విమానాశ్రయాలు ప్రత్యామ్నాయ ట్రాన్సిట్ హబ్‌లుగా మారే అవకాశం ఉంది. అయితే ఇందుకు  మౌలిక సదుపాయాలను మరింత ఆధునీకరించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చమురు ధరల ప్రభావం వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై  ఎక్కువగా ఉంటుంది. సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులపై భారం పడవచ్చు. అయినప్పటికీ, భారత్‌లో ఉన్న భారీ దేశీయ మార్కెట్ ఈ షాక్‌లను తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతున్నా..  మన అంతర్గత డిమాండ్ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోంది. , ప్రపంచ చమురు తుఫాను భారత్‌కు ఒక పరీక్ష వంటిదే. అందులో సందేహం లేదు. ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా త్వరితగతిన స్పందించడం ద్వారా భారత్ తన వృద్ధిని సుస్థిరం చేసుకోవచ్చు. ఎస్బీఐ అంచనాల ప్రకారం 2027 నాటికి భారత్ తన బలమైన బ్యాంకింగ్, విధానపరమైన నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక పటంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది.

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
భర్త హత్యకు ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపిన భార్య ఘటన వైయస్సార్ కడప జిల్లాలో సంచలనం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.