తెలంగాణ భవన్‌లో కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ కుస్తీ పోటీలు

Publish Date:Jul 24, 2026

Advertisement

 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శుక్రవారం  'కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్' పేరుతో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి, తలసాని సాయికిరణ్ యాదవ్ తదితర నాయకులు, రాష్ట్రంలోని పలు అఖాడాలకు చెందిన రెజ్లర్లు, క్రీడాకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా పుట్టినరోజు అంటే ప్రశాంతంగా గడపాలని అనుకున్నప్పటికీ, "మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం.. తెల్లారి లేస్తే పోరాటమే.. ఉదయం ధర్నా అయినా, సాయంత్రం కుస్తీ అయినా ఫైటింగ్ మోడ్‌లోనే ఉండాలి" అని తలసాని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నవ్వుతూ పేర్కొన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి కుస్తీతో ఎంతో అనుబంధం ఉందని, ఆయన తండ్రి కూడా ప్రముఖ పహిల్వాన్ అని గుర్తు చేశారు. అందుకే రెజ్లింగ్ క్రీడాకారుల అభివృద్ధిపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. రాష్ట్రంలోని సుమారు 70 అఖాడాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యే సుమారు 150 మంది రెజ్లర్లకు షూలు, శిక్షణ, ఇతర ఖర్చులను భరించే బాధ్యతను తలసాని స్వయంగా తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేలా మౌలిక సదుపాయాలు, అభివృద్ధిపై విస్తృతంగా పనిచేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి అన్ని రకాల క్రీడలకు పెద్దపీట వేసేలా సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తలసాని వంటి నాయకులు క్రీడాకారులకు అండగా ఉంటారని, తాను కూడా ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రెజ్లర్లకు ఎలాంటి అవసరం వచ్చినా బీఆర్ఎస్ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన జన్మదినం సందర్భంగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని మల్లయుద్ధానికి మహాభారత కాలం నుంచే గొప్ప చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది సుమారు 150 మంది రెజ్లర్లు జాతీయ స్థాయికి ఎంపికవుతున్నారని తెలిపారు. వారికి అవసరమైన శిక్షణ, క్రీడా సామగ్రి, ఇతర సదుపాయాలన్నింటినీ అందించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు. భవిష్యత్తులో కూడా రెజ్లింగ్ క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కుస్తీ పోటీలు తెలంగాణ భవన్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రెజ్లర్లు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.

By
en-us Political News

  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు
  నిరాహార దీక్షలో ఉన్న తనను   సందర్శకులు  కలవకుండా ఆంక్షలు విధించారని వాంగ్ చుక్ ఆరోపంచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది
వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
వైరస్  వ్యాప్తి వేగాన్ని అరికట్టుందుకు   ఆరోగ్య శాఖ సిబ్బంది  యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న ప్రాథమిక కాంటాక్ట్‌లను  గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు భారత్ వేదిక కాబోతోందా? చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించిన క్రేజీ ప్లాన్స్, లాజిస్టికల్ సవాళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్, వార్‌బర్గ్ పింకస్ నుండి ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. సుమారు ₹10,000 కోట్ల విలువైన ఈ బిగ్ ఇన్సూరెన్స్ డీల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వాటా వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఓపెన్ ఏఐ రక్షణ సరిహద్దులను దాటుకుని హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్‌పై మానవ ప్రమేయం లేకుండా దాడి చేసిన ఏఐ మోడల్. సైన్స్ ఫిక్షన్ వంటి ఈ విపరీతమైన సైబర్ దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరికల గురించి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ GenPage , అమెజాన్ ప్రైమ్ వీడియో Lighthouse ప్రాజెక్టులతో AI ఆధారిత హోమ్‌పేజీలను తీసుకువస్తున్నాయి. కానీ యూజర్లు ఈ మార్పులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రింగ్‌కాన్ Gen 3 స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి లాంచ్ అయింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్పెషల్ టై ఇన్, 14 రోజుల బ్యాటరీ లైఫ్, సబ్‌స్క్రిప్షన్ ఉచిత హెల్త్ డేటా మరియు ప్రతి 2 సెకన్ల SpO2 ట్రాకింగ్ ఫీచర్లతో $349 ధరకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు చదవండి.
గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ AGI ఆవిష్కరణ మరియు దాని వల్ల రాబోయే తీవ్రమైన సైబర్, న్యూక్లియర్ భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు. AGI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఈ కథనంలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.