Publish Date:May 15, 2026
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు బిగుస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఫార్ములా ఈకార్ కేసులో తాజాగా కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 31న ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఈ కేసులో కేటీఆర్ ఎసీబీ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. చార్జిషీట్ కూడా ఫైల్ చేసింది. ఆ చార్జిషీట్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కు విశ్వవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కేలా చేస్తామంటూ హైదరాబాద్ లో ఫార్ములా ఈకార్ రేస్ లు ఏర్పాటు చేసి ఇందుకోసం.. కారు రేసుల సంస్థకు చెల్లించిన 55 కోట్ల రూపాయలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని విదేశాల్లోని సదరు సంస్థకు చెల్లించేందుకు అదనంగా మరో 10 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలూ ఉన్నాయి.
అప్పట్లో కేటీఆర్ మంత్రిగా ఉన్న పురపాలక శాఖ నిధుల నుంచి ఈ సొమ్మును బదలాయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ సొమ్ము చెల్లించారంటూ కేటీఆర్ తో పాటు అప్పటి హెచ్ఎండీఏ చీఫ్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, చీఫ్ ఇంచిజీన్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు ఈ కారు రేసుల సంస్థలపై ఏసీబీ కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కొన్నారు.
ఆయనతో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ని కూడా ఏసీబీ విచారించింది. ఈ విచారణలలో సేకరించిన వివరాలు, తమ దర్యాప్తులో తేలిన అంశాలతో ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్ ను ఆమోదించిన ఏసీబీ కోర్టు వీరికి సమన్లు పంపింది. దీంతో ఈ కేసులో ఏ1 కేటీఆర్ కు ఉచ్చు బిగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-in-deep-trouble-36-219841.html
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..