Publish Date:Oct 10, 2012
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాటలో బిజీగా ఉండి ప్రజలతో మమేకమౌతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజుల మీకోసం పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామోనన్న ఉలికిపాటుతో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు నేడు సమావేశం అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం విదితమే. కానీ నేడు చంద్రబాబు రాయలసీమలో చేపట్టిన మీకోసం యాత్రకి వస్తున్న ప్రజాసందోహం చూసి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తాము కూడా ఏదో ఒక ప్రజాయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర జగన్ అరెస్టుతో ఆగిపోయింది. జగన్ అరెస్టుతో విజయమ్మ ఓదార్పు యాత్రను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తాజాగా వై.ఎస్.ఆర్. కుమార్తె జగన్ సోదరి షర్మిలతో పాదయాత్రలు కొనసాగించాలని నిర్ణయించారు. షర్మిల యాత్ర ఈ నెల పదిహేడో తేదీన కడపజిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభిస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kiran-kumar-24-18061.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.