Publish Date:Oct 15, 2012
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు చేసిన రైతులను ఇంకా సమస్యలు ఛుట్టుముడుతూనే ఉన్నాయి. అనేక వ్యయప్రయాసకోర్చి పంట పండించిన రైతులు ఇప్పుడు మిల్లర్లనుండి అడ్డంకులను ఎదురుకుంటున్నారు. ప్రతిసారీ లానే ఈ ఏడాది వారు కరెంటును సాకుగా తీసుకుంటున్నారు. దీని వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుస్తున్న ధాన్యం కొనుగోలుకు ఒక ప్రక్క ఇందిరా క్రాంతి పధకం, పౌరసరఫరాల శాఖ, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, భారత ఆహార సంస్ద 1779 కేంద్రాలు సిద్దంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ మిల్లర్లు మాత్రం కొనుగోలు చేయలేమిని పెరిగిన విద్యుత్ చార్జీల వల్ల మిల్లింగ్ చేయడం కష్టమని తేల్చింది. ప్రతి ఏడాది ఐకెపి, పౌరసరఫరాల శాఖ, ఎఫ్ సి ఐ సహకార సొసైటీలు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లకు అందిస్తారు. వాటిని మిల్లింగ్ చేసి మిల్లర్లు ఎఫ్ సి ఐకి అప్పగిస్తారు. ఇందుకు గానూ ప్రతి క్వింటాలుకు 15 రూపాయలు ఎఫ్ సి ఐకి మిల్లర్లకు చెల్లిస్తుంది. రాష్ట్రంలో 6 వేల రైస్ మిల్లులుండగా, ఏటా కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తాయి. పెరిగిన విద్యుత్ చార్జీల వల్ల మిల్లింగ్ చేయలేమని, అంతే కాకుండా 60శాతం కంటే ఎక్కువగా విద్యుత్ ను వినియోగించరాదని, ట్రాన్స్ కో మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఆదేశాలను అతిక్రమిస్తే 10 రెట్లు జరిమానా తప్పదని హెచ్చరించింది. రోజంతా మిల్లింగ్ చేస్తే 2 లకల వరకు విద్యుత్ బిల్లులకు ఖర్చు అవుతుందని అదే పది రెట్లు జరిమానా వేస్తే 12 లకలు చెల్లించాల్సి వస్తుందని, అలాగే నిరంతర కరెంటు లేక పోతే నూకలు వస్తాయని వారు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు ఇది శరాఘాతంగా తగులుతుందని ఆందోళన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kharif-season-24-18181.html
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!