టీఆర్ఎస్‌ పాలిట తుమ్మల తుమ్మముల్లు కానున్నారా?

Publish Date:Nov 7, 2014

Advertisement

 

 

నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఆయన ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి చేతిలో పెట్టేసిన సందర్భంలో రాజకీయంగా పార్టీ కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడే ఉద్దేశంతో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఆనాడు చంద్రబాబు చేసిన తిరుగుబాటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పచ్చగా కళకళలాడుతూవుండటానికి ప్రధాన కారణమైంది. 

 

ఆనాడు ఎన్టీఆర్‌ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే, ఈనాడు తుమ్మల నాగేశ్వరరావు కారణంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు తిరుగుబాటు చేసే అవకాశం వుందని అంటున్నారు.

 

గతంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌కి జిగిరీ దోస్త్. ఎంత దోస్త్ అంటే... ఒకర్నొకరు ఆప్యాయంగా ‘బావా.. బావా’ అని పిలుచుకునేంత దోస్త్. ఆ దోస్తీ కారణంగానే తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తుమ్మల పార్టీ మారడం వెనుక కేసీఆర్ ఇచ్చిన మంత్రి పదవి ఆఫర్ కూడా ప్రధాన కారణమనే అభిప్రాయాలు వున్నాయి. కేసీఆర్ అవసరమైతే తల నరుక్కుంటారు తప్ప తన సొంత మనుషులకు ఇచ్చిన మాట మాత్రం ఎంతమాత్రం తప్పరు. తుమ్మలకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ త్వరలో ఆయనకు హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌కి మొదటి నుంచీ సేవ చేసిన నాయిని నరసింహారెడ్డి ఇప్పుడు హోం మంత్రిగా వున్న విషయం తెలిసిందే. నాయినిన తప్పించి తుమ్మలను ఆ స్థానంలో హోం మంత్రి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

 

తన అనుంగు మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావుకు హోం మంత్రి పదవిని అప్పగించిన అనంతరం కేసీఆర్ తన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే నిమిత్తం ఓ రెండు నెలలపాటు అమెరికా వెళ్ళనున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వ బాధ్యత మొత్తం హోం మంత్రి పదవిలో వుండే తుమ్మలతోపాటు కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కి అప్పగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచన ఇలా వుంటే, కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆలోచన మాత్రం మరోరకంగా వున్నట్టు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ హోం మంత్రి బాధ్యతలు అప్పగించిన వెంటనే పార్టీలో తిరుగుబాటు చేయడానికి హరీష్ రావు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. హరీష్ రావు తిరుగుబాటు చేసిన పక్షంలో ఆయనకు 25 నుంచి 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారని తెలుస్తోంది. వారికి తోడుగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకుని హరీష్ రావు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

 

హరీష్‌రావు ఈ తరహా ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసి కూడా సీఎం కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హరీష్ రావు కూడా పైకి తాను కేసీఆర్‌కి విధేయుడిగా వుంటానని చెబుతున్నప్పటికీ, తుమ్మలకు హోం మంత్రి పదవి ఇవ్వగానే తన యాక్షన్ ప్లాన్ అమలులో పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌ నాయకులలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా వుంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారికి, తన బంధుమిత్రులకే అన్ని విషయాలలోనూ కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న బాధ వారిలో వుంది. దీనితోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల వారు కూడా కేసీఆర్‌ని వ్యతిరేకిస్తూ వున్నారు. త్వరలో నాయిని పదవి ఊడిపోబోతోందని తెలిసిన రెడ్డి సామాజిక వర్గం వారు కూడా కొంత ఆగ్రహంగా వున్నారు. ఇలాంటి వ్యతిరేక శక్తులన్నిటికీ చేరువ అవుతున్న హరీష్ రావు ‘కీలక సమయం’లో వీరందరి సహకారం తీసుకోవడానికి వ్యూహ రచన చేసినట్టు సమాచారం.

 

తెలుగునాట గతంలో రెండు సందర్భాలలో అధికార మార్పిడి ‘కుదుపు’లు సంభవించాయి. ఒక కుదుపుకు కారణం నాదెండ్ల భాస్కరరావు అయితే, మరోసారి లక్ష్మీపార్వతి కారణం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కుదుపుకు తుమ్మల నాగేశ్వరరావు కారణం అవుతారనీ, టీఆర్ఎస్ ప్రభుత్వ బుడగ పాలిట తుమ్మల తుమ్మముల్లుగా మారతారనీ అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ అంశం మీద మరో రెండు మూడు నెలల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

By
en-us Political News

  
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.