పిట్టల దొరసాని వచ్చింది...కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్ సెటైర్లు

Publish Date:Apr 25, 2026

Advertisement

 

ఇన్నాళ్లూ పిట్టలదొర క్యారెక్టర్ చూశాం..

ఇకపై పిట్టల దొరసాని వేషము చూడాలి అర్వింద్ సెటైర్లు

తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో స్పందించింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసింది. కవిత ప్రకటించిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై  అధికార కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. బీఆర్ఎస్ తోక పార్టీనే కవితక్క ప్రారంభించిన ఈ కొత్త పార్టీ (తెలంగాణ రాష్ట్ర సేన) అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తలా తోక ఎప్పటికీ ఒక్కటేనని బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తనయ టీఆర్ఎస్.. అంతా గ్యాస్ అంటూ సెటైర్ వేశారు.


బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్, కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవితను తాము ఎప్పుడో మర్చిపోయామని, ఇప్పుడు మళ్లీ ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఆసక్తికరమైన రాజకీయ చర్చలకు దారితీసింది.గతంలో కవితపై 'పిట్టలదొర' అని విమర్శించిన అర్వింద్, ఇప్పుడు ఆమె కొత్త పార్టీ ఏర్పాటును ఉద్దేశించి 'పిట్టల దొరసాని' పాత్రను పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆమె ఇంకా టీఆర్ఎస్ హ్యాంగోవర్‌లోనే బతుకుతున్నారని, వాస్తవాలను గుర్తించడం లేదని ఆయన విమర్శించారు.

మరోవైపు, రాష్ట్ర బీజేపీ నాయకుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, రాష్ట్రంలో బీజేపీని ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.బీఆర్ఎస్ నుండి పుట్టినదే టీఆర్ఎస్ అని రాంచందర్ రావు ఆరోపించారు. కవిత ప్రారంభించబోయే కొత్త పార్టీ రాజకీయ అస్తిత్వంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమేనని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం కవిత తన రాజకీయ ప్రస్థానంలో తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీల మధ్య, కవిత కొత్త పార్టీ తన ప్రభావాన్ని ఎలా చూపుతుందో వేచి చూడాల్సిందే.ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు దీన్ని కేవలం ఒక రాజకీయ వ్యూహంగా చూస్తారా లేక ఆదరిస్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది.
 

By
en-us Political News

  
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది.
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.