కమలంలో ‘కవిత’ కలకలం ?

Publish Date:Mar 16, 2023

Advertisement

ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ( బీజీపీ) అంటే, అదొక విభిన్న పార్టీ  కానీ, ఇప్పడు కాదు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ, అతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నకలుగా తయారైంది. ఈ మాట ఎవరో బయటి వారు అంటున్న మాటే కాదు.. బీజేపీలోని  సీనియర్ నాయకులు,   సీనియర్ కార్యకర్తలూ అంటున్నారు. సరే  ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీకి ఉన్నదీ లేదు పోయేది లేదు కనుక అక్కడ ఎలా ఉన్నా ఎన్ని గ్రూపు తగవులు ఉన్నా పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు.

కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణపై చాలానే ఆశలున్నాయి. అధికారం లక్ష్యగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చినా రాకున్నా పశ్చిమ బెంగాల్  లో లాగా, ఒక బలమైన శక్తిగా ఎదిగే  అవకాశం ఉందని  పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. నిన్న గాక మొన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర్ర హోం మంత్రి, పార్టీ స్ట్రాటజిస్ట్ (వ్యూహకర్త) అమిత్ షా  పార్టీ నాయకులు విబేధాలు మరిచి కలిసి పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. అదే మాట  ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. త్రిపురలో గెలిచిన బీజీపీ తెలంగాణలో ఎందుకు గెలవదని ప్రశ్నిస్తున్నారు.

అయితే  అందరూకలిసి పని చేయాలని చెప్పి  అమిత్ షా అలా వెళ్ళారో లేదో, ఇలా తెలంగాణ రాష్ట్ర బీజేపీలో రుసరుసలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమల దళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తప్పు పట్టారు. అలాగే ఆర్వింద్‌ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీనియర్‌ నేత శేఖర్జీ  ( పేరాల శేఖర్‌ రావు) సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ నేతల్లో మరింత కలకలానికి కారణమయ్యాయి.

 అరవింద్ అంటే, కాంగ్రెస్ కల్చర్ లో పుట్టి పెరిగిన నాయకుడు. ఆయన పార్టీ ఎంపీ అయినా, భావజాల పునాదుల పరంగా బీజేపీకి బయటి వ్యక్తి. కానీ  శేఖర్జీ ఆలా కాదు. ఆయన పుట్టి పెరిగింది, బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో, సంఘ్ ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త)గా, అనేక మందికి ఆదర్శంగా నిలిచిన  నాయకుడు.. అయన కూడా క్రమ శిక్షణ ఉల్లంఘించి, సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్  మీద విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి, బండి సంజయ్  పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఒకెత్తు అయితే, శేఖర్జీ చేసిన విమర్శలు మరింత డ్యామేజింగ్  గా ఉన్నాయని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.    

కవిత పై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై, బీఆర్ఎస్  ఎంతగా రాద్ధాంతం చేసినా, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి బీఆర్ఎస్ కూడా బండి వ్యాఖ్యలను ముందు లైట్ గానే తీసుకుంది, కానీ  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపించడంతో  ఇష్యూని డైవెర్ట్ చేసేందుకో ఏమో  ఢిల్లీ నుంచి గల్లీ వరకు ... బండికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చి బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను మరిచి పోయారు. బీజేపీ నాయకులు మాత్రం బండికి అటూ ఇటుగా విడిపోయారు. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్‌జీ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు.

 ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్‌ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్‌ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్‌ సెంటర్‌ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్‌పై శేఖర్జీ మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. నిజానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారుతుందా? కేంద్ర పార్టీ ఎలా స్పదిస్తుంది .. చూడాల్సింది చాలా వుంది .. చెప్పాల్సింది మిగిలే వుంది..అంటున్నారు.

By
en-us Political News

  
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.