కేటీఆర్ పాదయాత్ర పోస్ట్ పోన్.. కారణమేంటంటే?

Publish Date:Jul 10, 2026

Advertisement

 భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది.  2028 ఎన్నికలలో బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్ తన పాదయాత్ర ప్రకటించారు. ఆయన ప్రకటించిన మేరకు   ఈ ఏడాదే ఆయన పాదయాత్ర ప్రారంభించాలి. కానీ  నుంచే ఈ మహా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. తన పాదయాత్ర ద్వారా పార్టీకి ఏ మేరకు మైలేజ్ వస్తుంది.. పార్టీ అధికారంలోకి రావడానికి తన పాదయాత్ర ఏంతగా దోహదపడుతుంది వంటి వివరాలను ఆయన క్షేత్రస్థాయిలో  సర్వేలు చేయిచి ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక పాదయాత్రపై కుటుంబ సభ్యులతో కూడా చర్చించారు. ఇన్నీ చేసి ఇక పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేయడమే తరువాయి అని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

 ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేని ఈ సమయంలో పాదయాత్ర చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదన్న భావనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నారంటున్నారు. కాగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టదలచిన బస్సు యాత్రను కూడా ఇదే కారణంతో నిరవధికంగా వాయిదా వేసుకున్నారని అంటున్నారు. 

సాధారణంగా  పాదయాత్రలు   అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు చేపడితేనే  ఫలితం ఉంటుంది. అలా కాకుండా పాదయాత్ర చేపడితే.. ప్రజల నుంచి పెద్దగా స్పందన ఉండదని పరిశీలకు చెబుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు కనుక మరో ఏడాది పాటు పాదయాత్ర ఊసెత్తకుండా ఉండటమే మేలని కేటీఆర్, బస్సు యాత్ర కూడా ఏడాది తరువాత చేపడితేనే ఫలితం ఉంటుందని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

KTRs padayatra postponed, Brs, Working President, Revantah Government, Anti Incumbency

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.