ముంబైలో పవన్ కల్యాణ్ భుజాలకు సర్జరీ.. ఎప్పుడంటే?

Publish Date:Jul 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ జరగనుంది.  గత కొంతకాలంగా పవన్ కల్యాణ్  తీవ్రమైన భుజాల  నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే..  ఆయనకు ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలని సూచించారు. జూన్ నెలాఖరులోనే ఆయన తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై వెళ్లి సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్ కు వైద్యులు..  రెండు భుజాల రొటేటర్ కఫ్  దెబ్బతిందని చెప్పారు.  అలాగే రెండు ప్రధాన భుజాల కండరాలు పూర్తిగా చిట్లిపోయాయనీ పరీక్షల్లోతేలినట్లు వైద్యులు తెలిపారు.  పరిస్థితి తీవ్రతను బట్టి వెంటనే శస్త్రచికిత్స అవసరమని అప్పుడే చెప్పారు. అందరూ కూడా  పవన్ కల్యాణ్ సర్జరీ తరువాతే ముంబై నుంచి తిరిగి వస్తారని అప్పట్లో భావించారు. అయితే..    రాష్ట్రంలో ఉన్న ముందస్తు  పాలనా బాధ్యతలు, కీలకమైన  అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకుచెప్పారు.   ఇప్పుడు ఆయన తీరిక చేసుకుని భుజాలకు సర్జరీ చేయించుకోవడానిక మంబై బయలుదేరారు. 

తాజా సమాచారం మేరకు.. శనివారం  (జూలై 11)  పవన్ కు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో  మొదటి విడత సర్జరీ జరుగుతుంది.  ఆ తర్వాత కొద్ది రోజుల విరామం ఇచ్చి, పరిస్థితిని బట్టి రెండో భుజానికి కూడా వౌద్యులు సర్జరీ చేస్తారు. ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు  పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో..  పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రజా ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు తాను నెల రోజుల పాటు అందుబాటులో ఉండననీ, ఆ సమయంలో   పార్టీ ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, , క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.  

Pawan Kalyan to undergo shoulder surgery in Mumbai, Shoulders Injury, Gabbarsingh Moovie, kokila Dhirubhai Ambani, Hospital

By
en-us Political News

  
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.