శ్రీలక్ష్మి కౌంటర్ దాఖలు ,రాజగోపాల్‌కు చుక్కెదురు
Publish Date:Dec 26, 2011
Advertisement
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో సస్పెండ్‌కు గురైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిలు విషయంలో సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె ఇటీవల అరెస్టై బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఈమె బెయిల్ సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన కోర్టు ఈ నెల 26వ తేదిలోగా సిబిఐ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను 29కు వాయిదా వేసింది. దీంతో ఆమె సోమవారం కౌంటర్ దాఖలు చేశారు.
కాగా రాజగోపాల్‌కు సోమవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిబిఐ కోర్టు రాజగోపాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో రాజగోపాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.రాజగోపాల్‌కు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున రాజగోపాల్‌కు బెయిల్ ఇవ్వరాదని సిబిఐ వాదించింది. అంతేకాకుండా బెయిల్ ఇస్తే రాజగోపాల్ సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం కూడా ఉందని సిబిఐ అన్నది. ఒఎంసి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ స్థితిలో రాజగోపాల్‌కు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి మేలు చేకూర్చే విధంగా రాజగోపాల్ వ్యవహరించారని సిబిఐ విమర్శించింది. నాంపల్లి కోర్టు రాజగోపాల్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
http://www.teluguone.com/news/content/karnataka-24-10274.html





