కడప కాంగ్రెస్ లో కలకలం
Publish Date:Mar 28, 2012
Advertisement
కడపజిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. జూన్ లోగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గానికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, రైల్వేకోడూరు నియోజకవర్గానికి అజయ్ బాబు పేరును దాదాపు ఖరారు చేసింది. రాజంపేట నియోజకవర్గంలో మాత్రం కొంత గందరగోళం తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి తాను పోటీచేయబోతున్నట్లు ప్రకటించుకోగా ఆయన ప్రత్యర్థి వర్గం మోదుగల పెంచలయ్య మాజీ మంత్రి బ్రహ్మయ్య పేర్లను తెరపైకి తెచ్చింది, దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే రాయచోటిలో ప్రధానంగా పిసిసి సభ్యుడు రామ్ ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిల మధ్య టిక్కెట్ పోరు నడుస్తోంది. రాజంపేటలో కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఖరారైందని మల్లిఖార్జునరెడ్డి ప్రచారం చేసుకుంటుండగా నాన్ రెడ్డి కులస్తులంతా తమలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. వీరికి మంత్రి సి.రామచంద్రయ్య బాసటగా నిలుస్తున్నారు. రైల్వేకోడూరులో మాజీ ఎమ్మెల్యే జివి ప్రసాద్, మాజీ ఎంపిపి ఈశ్వరయ్యలు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ బత్యాల మద్దతు ఈశ్వరయ్యకు ఉన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/kadapa-district-congress-24-12966.html





