ఉప ఎన్నికల తరువాత సిఎం కిరణ్ సర్కారులో మంత్రి పదవుల మార్పు ఉంటుందా? అదీ వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులైన మంత్రులకు పదవులు ఊడతాయా? కొత్త మంత్రులు కొలువుతీరుతారా? దీనిలో మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశముందా? అన్న పలు ప్రశ్నలకు జెసి తడుముకోకుండా తనకు మాత్రం మంత్రి పదవి రావటం ఖాయమంటున్నారు. ఇటీవల కొంత కాలం అలిగి అమెరికా వెళ్లిపోయిన జెసి తిరిగి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదేంటీ మీరొచ్చేశారు అని ప్రశ్నించటం పాపం! జెసి తనకు త్వరలో మంత్రి పదవి ఇస్తారు కాబట్టే తిరిగొచ్చానంటున్నారు. జగన్ ను వ్యతిరేకించే నేతగా ఈయనకు కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చింది. నెలన్నర క్రితం అనంతపురం కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యత్వం కూడా వద్దన్న జెసి ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రి శైలజానాధ్, ఎంపి అనంతవెంకటరామయ్య, అనంత కాంగ్రెస్ అభ్యర్థి ముర్షీదాబేగంలతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే నాయకులతో ఈ ప్రచారం ఏమిటని ఆశ్చర్యపోతుంటే వీరు ముగ్గురూ కూడా ఎంతో సఖ్యతగా ఉన్నట్లు ఫోజులిచ్చారు. ఈ ఫోజుల తరువాతే జెసి తన మంత్రి పదవి స్టోరీ విప్పారు. దీనికి నేతలు అదంతా వట్టేదే ఇది జెసి స్టైలు మాత్రమే అని సమాధానమిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jcdiwakar-reddy-24-14619.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.