తమిళ చరిత్రలో రాజకీయ తన్నులాటలెన్నో!

Publish Date:Feb 10, 2017

Advertisement

 

పాలిటిక్స్ అంటే పాలన మాత్రమేనా? అస్సలు కాదు! రాజకీయంలో బోలెడు రచ్చ వుంటుంది. అందుకే, ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో దేశంలో రాజకీయాలు ఒక్కోలా వుంటాయి. దేనికవే ప్రత్యేకం. ఇక తమిళనాడు గురించైతే చెప్పేదే లేదు! అక్కడ ప్రాంతీయ అభిమానం ఎక్కువ. వ్యక్తి పూజ విపరీతం. అందుకే, దేశమంతటిదీ ఓ దారైతే... చెన్నై నేతలది మరో దారి! ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ కొనసాగుతూ వస్తోంది!

 

ఇప్పుడు శశికళ, పన్నీర్ సెల్వం మధ్య గొడవ చుస్తున్న వారికి భలే టెన్షన్ గా వుండవచ్చు. కాని, తమిళ రాజకీయ చరిత్ర తెలిసిన వారికి ఇదేం పెద్ద విశేషమూ కాదు, విడ్డూరమూ కాదు! అక్కడ ఎవరో ఇద్దరు అగ్ర నేతల మధ్య భీకర పోరు పదే పదే జరుగుతూ వస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా రాజ్యాంగం కూడా రాసుకోక ముందే అక్కడ బడా నేతలు ఇద్దరు కొట్టుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వారే.. పెరియార్, అన్నాదురై!

 

ద్రవిడ సిద్ధాంతం ప్రచారం చేసి ఉత్తరాది మీద, అసలు భారతదేశం మీదే ద్వేషం నూరిపోశారు పెరియార్. ఆయన 1948లో తొలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'చీకటి రోజ'ని వ్యాసం రాశారు. కాని, ఆ మొదటి స్వాతంత్ర్య దినం ఆనందదాయకమైందని అన్నాదురై పేర్కొన్నారు. ఇలా వీరిద్దరి మధ్యా భేదాభిప్రాయాలు పొడసూపాయి. మెల్లగా అవ్వి అభిప్రాయ భేదాలుగా మారి పెరియార్ మణియమ్మను పెళ్లాడటంతో అన్నాదురై పార్టీ నుంచి బయటకొచ్చేశారు. అప్పుడు, 1949లో ఏర్పడిందే, డీఎంకే!

 

పెరియార్ తో గొడవ పడ్డ అన్నాదురై డీఎంకే స్థాపిస్తే ఆయనతో చాలా ఏళ్లు కలిసి నడిచిన ఈవీకే సంపత్ 1961లో కొత్త పార్టీ పెట్టాడు. అందుక్కారణం డీఎంకే ద్రవిడ నాడు అంటూ ప్రత్యేక దేశమే కావాలని డిమాండ్ చేయటం. అది పెరియార్ అన్న కొడుకైన ఈవీకే సంపత్ కు నచ్చలేదు. ఆయన అన్నాదురైతో విడిపోయి హీరో శివాజీ గణేశన్ తో కలిసి తమిళ దేశీయ కట్చి అనే పార్టీ పెట్టాడు. తరువాతి కాలంలో ఇది కాంగ్రెస్ లో విలీనమైపోయింది!

 

అన్నాదురై స్థాపించిన డీఎంకే చాలా ఏళ్లు కాంగ్రెస్ ను తట్టుకుని బలంగా నిలిచింది, కాని, ఆ పార్టీని స్థాపించిన అన్నా మరణించటంతో కరుణానిధి వేగంగా పావులు కదిపాడు. మొదట తనకు అడ్డువచ్చిన నెడుంజెళియన్ అనే నాయకుడ్ని ఎంజీఆర్ సాయంతో అణగదొక్కాడు. కాని,తరువాత కరుణకు సూపర్ స్టార్ ఎంజీఆర్ తోనూ చెడింది. డీఎంకే కోశాధికారిగా వున్న ఆయన్ని అమాంతం తొలిగించాడు. దాంతో ఎంజీఆర్ ఆగ్రహంతో వేరు కుంపటి పెట్టాడు. అలా పుట్టిందే అన్నాడీఎంకే! ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపనతో కరుణానిధి పన్నెండేళ్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. తమిళుల సినిమా అభిమానంతో ఎంజీఆర్ చనిపోయే రోజు వరకూ ఏకబిగిన ఏలుకుంటూ పోయాడు!

 

పెరియార్ తో గొడవ పడ్డ అన్నాదురై ఒక పార్టీ పెడితే, ఆయనతో విభేదించిన సంపత్ మరో పార్టీ పెట్టాడు. తరువాత కరుణతో కయ్యానికి దిగిన ఎంజీఆర్ మూడో పార్టీని జనం ముందుకి తెచ్చాడు. అయితే, ఎంజీఆర్ పెట్టిన అన్నాడీఎంకేలో కూడా అగ్ర నాయకుల ఉగ్ర గొడవలు ఎంత మాత్రం ఆగలేదు. ఎంజీఆర్ మరణంతో ఆయన భార్య జానకీ, జయలలితల మధ్య అధికార పోరు భగ్గుమంది. జయను జానకీ రామచంద్రన్ వర్గం ఎంతగా అవమానించినా మొండిగా ఎదురునిలిచి పార్టీని దక్కించుకుంది. క్రమంగా జయలలిత నుంచి పురుచి తలైవీగా, అమ్మగా ఎదుగుతూ వచ్చి తిరుగులేని నాయకురాలైంది. ఇక వేరు వేరు పార్టీల్లో వున్నా కరుణానిధి, జయలలితల దారుణ శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరికి చిప్ప కూడు తినిపించే సంస్కృతికి తెర తీశారు ఇద్దరూ!

 

జయలలిత అనూహ్య మృతితో ఇప్పుడు శశికళ, పన్నీర్ మధ్య దశాబ్దాల తమిళ రాజకీయ సంస్కృతికి తగ్గట్టే రాజకీయ జల్లికట్టు సాగుతోందంటున్నారు తలపండిన విమర్శకులు! చూడాలి మరి.. ఈ సారి వున్న పార్టీ ఎవరి వశం అవుతుంది, కొత్త పార్టీ ఏమైనా వస్తుందా, లేక అసలు వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకే అనే పేరన్నా వినిపిస్తుందా? లేదా?

 

By
en-us Political News

  
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.