వైఎస్ఆర్సిపిలో ఉప్పునూతలను ఆకట్టుకున్నదేమిటో?

Publish Date:Sep 4, 2012

Advertisement

ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులై చెట్టాపట్టాలేసుకోవటం రాజకీయంలో షరా మామూలే అంటుంటారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి కూడా మినహాయింపుకాదు. ఒకప్పుడు వైఎస్ను వ్యతిరేకించేవారు. అసలు తెలంగాణా రాకపోవటానికి వైఎస్ఆర్ కారణమని చిటపటలాడిన వ్యక్తిగా పురుషోత్తమరెడ్డికి బాగా గుర్తింపొచ్చింది. అప్పట్లో వై.ఎస్ మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడ్డ పెద్దాయన ఇప్పుడు పూర్తిగా మాటమార్చారు. అదే నోటితో తాను వైఎస్ హయాంలో చూసినంత అభివృద్థి మళ్లీ చూడలేదంటూ డంకా బజాయించి చెబుతున్నారు. ఉప్పునూతలకి మొదట్నుంచీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. అతిగా ప్రేమించడం, అతిగా ద్వేషించడం ఆయనకు అలవాటేనని ఆయన సన్నిహితులంటుంటారు.


 

ఇప్పుడు మళ్లీ వైఎస్ మీద పెద్దాయనకి బాగా ప్రేమపుట్టుకొచ్చిందేమో.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అందరూ లబ్ది పొందారని, అప్పటి సంక్షేమపథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయని, రాష్ట్రంలో ప్రస్తుతం పాలన స్తంభించిపోయిందని,  తాను ఈ నెల 9న వైకాపాలో చేరనున్నానని, జగన్మోహనరెడ్డి సమర్ధవంతమైన నేతగా ఎదుగుతాడని ఉప్పునూతల ప్రకటించారు. మరి వైఎస్ బతికున్న రోజుల్లో ఆయన తెలంగాణారాష్ట్రం రాకుండా అడ్డుపడుతున్నారని, వైఎస్ అభివృద్థి నిరోధకుడని చేసిన ప్రకటనల మాటేంటి? అసలు ఉప్పునూతల జగన్ వర్గంలో చేరడానికి బలమైన కారణాలేంటోనని అంతా అనుకుంటున్నారు.

 



 కేవలం జగన్మోహనరెడ్డి పిలుపు ఇచ్చారని ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక తెలంగాణావాదులు పట్టించుకోలేదని అలిగారా? కాంగ్రెస్లో ఉంటే టిఆర్ఎస్తో ఉండే దోస్తానా దెబ్బతింటోందనిపించిందా? వైఎస్సార్సీపీలో చేరితే ఈసారి ఎన్నికల్లో తేలిగ్గా విజయం సాధించేయొచ్చనా? ఏమో.. ఉప్పునూతల మనసులో ఉన్న మాటని ఆయనంతట ఆయన బైటపెడితేతప్ప కనుక్కోవడం చాలా కష్టమే.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్..!
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.