వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో మంత్రులను బలిపశువులుగా చూసేందుకూ కాంగ్రెస్ పార్టీ వెనుకాడటం లేదు. ఈ కుట్ర వల్ల తాము నియోజకవర్గాల చులకన అవటమే కాకుండా పార్టీని వదిలేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మంత్రులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులకు తమను బలిచేయడం ఎంత వరకూ సబబమని మంత్రులు ఆయన్ని నిలదీశారు. అంతేకాకుండా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన నాయకులే తమను బలిపశువులను చేస్తే భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రారని వారు స్పష్టం చేశారు. తమ విషయంలో కాంగ్రెస్ పార్టీ బలిపశువులను చేయాలనే నిశ్చయించుకుంటే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఆజాద్ కు హెచ్చరించారు. వై.ఎస్. హయాంలో ఢిల్లీలోని కొందరు పెద్దలకు కూడా పెద్ద ఎత్తన ముడుపులు అందాయన్న విషయం అందరికి తెలిసిందేనని మరి వీరిని ఎందుకు వదిలేసి తమనే టార్గెట్ చేస్తున్నారని వారు ఆగ్రహంతో ప్రశ్నించినట్లు తెలిసింది. వై.ఎస్. హయాంలో ఆజాద్ కు కూడా ముడుపులు అందాయనే ప్రచారం జరిగింది. జగన్ పై కక్షతో పార్టీ అధిష్టానం ఆయనను ఇబ్బందులకు గురిచేయడమే గాక తమను కూడా ఇబ్బందులు పెడుతోందని, త్వరలో మరి కొందరు మంత్రులను సిబిఐ అరెస్ట్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు తమను కలవర పెడుతున్నాయని మంత్రులు ఆజాద్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-congress-24-14621.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.