ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌లో ఐటి అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ ద్వారా రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆ మొత్తానికి సంబంధించిన పన్ను వివరాలను సేకరించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు.
దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమంగా సేకరించిన నగదులో కొంత భాగం విదేశాలకు తరలించిననట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని దుబాయ్ కి పంపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డబ్బు తరలింపు పద్ధతి, విదేశీ లింకులు, లబ్ధిదారులపై ఇప్పుడు ఐటీ విచారణ కేంద్రీకృతమైంది.
ఈ వ్యవహారం ద్వారా ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు అక్రమ నగదు జనరేట్ అయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఎక్కువగా బ్లాక్ మనీ రూపంలో చలామణి అయినట్టు భావిస్తున్నారు. డిజిటల్ ట్రైల్ బయటపడకుండా ఉండేందుకు ఎక్కువ లావాదేవీలు నగదు రూపంలో నిర్వహించినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.
డిస్టిల్లరీలు, వెండర్లకు ఐదు సార్లు ఎక్కువగా చెల్లింపులు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఎలాంటి మెటీరియల్ సప్లై జరగకపోయినా ఫేక్ ఇన్వాయిస్‌లతో చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. రెండు డిస్టిల్లరీలు కలిపి రూ.76.92 కోట్లు నకిలీ బిల్లింగ్ ద్వారా తరలించినట్టు ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో వెండర్లకు ఐదు రెట్లు అధికంగా చెల్లింపులు చేసినట్టు గుర్తించడం ఈ కేసులో కీలక అంశంగా మారింది.
డిజిటల్ ట్రైల్ బయటపడకుండా ఉండేందుకు లాభాలను పూర్తిగా బ్లాక్‌లో దాచిపెట్టినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, త్వరలోనే మరిన్ని సోదాలు, నోటీసులు జారీ అయ్యే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-department-steps-in-to-ap-liquor-scam-case-36-218793.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.