టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హిట్ మెన్ రోహిత్ శర్మకు పొమ్మనలేక పొగ.!?

Publish Date:Jul 18, 2026

Advertisement

హిట్ మన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించిన వార్తలు  క్రికెట్ ప్రపంచంలో  తీవ్ర దుమారం రేపుతున్నాయి. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే మ్యాచ్ వేదికగా హిట్ మ్యాన్  అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడన్న ప్రచారంజోరుగా సాగుతోంది. ఆదివారం (జులై 19) లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు  అయితే  ఇది  రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా  పొమ్మనలేక పెడుతున్న పొగా  అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి. 

కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ సోషల్ మీడియా కథనాల ప్రకారం..   2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుకుంటుంది. ఇంతటి సుదీర్ఘ కాలం పాటు అతడు వన్డే ఫార్మాట్‌లో కొనసాగడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది.   అందుకే భవిష్యత్తు జట్టు నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా భావిస్తున్నారు.  వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్  ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ, ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటే మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనట్టే అవుతుంది. ఈ నేపథ్యంలోనే..  రోహిత్ శర్మ కెరీర్‌లో లార్డ్స్ లో ఆదివారం (జులై 19) జరిగే మ్యాచే చివరి మ్యాచ్ అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఇప్పటికే పలు సందర్భాలలో  2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే బలమైన ఆకాంక్షను రోహిత్ వ్యక్తం చేశాడు. అయితే అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా బీసీసీఐ పొమ్మనలేకపోగపెడుతున్నట్లుగా కనిపిస్తోందని రోహిత్ అభిమానలు అంటున్నారు. అయితే రోహిత్ శర్మ రిటైర్ మెంట్ కు సంబంధించి అతడి నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఇంత వరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.  

Rohit Sharma retirement rumours, Lords ODI match, Gautam Gambhir planning, 2027 ODI World Cup, BCCI selection updates, Indian cricket team news

By
en-us Political News

  
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.