కాలినడకన తిరుమలకు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.!
Publish Date:Jul 18, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శనివారం (జులై 18) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు శుక్రవారం (జులై 17) ఆమె అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకుని, క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు గా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండి తుల ఆశీర్వాదం పొందారు.టీటీడీ అధికా రులు ఆమెకు తీర్థప్రసా దాలు అందజేశారు. తదనంతరం ఆలయం ఎదురుగా ఉన్న అఖి లాండం వద్ద కొబ్బరికా యలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా, అనంతరం బేడి ఆంజనేయస్వామి ఆల యాన్ని కూడా దర్శించుకు న్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం గా పూర్తికావడంతో, ఆ మొక్కును తీర్చుకునేం దుకు అన్నా లెజినోవా శ్రీవారిని దర్శించుకున్నారు గతంలో కూడా తమ కుమారుడు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి తోటి భక్తులతో కలిసి నేలపై కూర్చుని ఎంతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. Anna Lezhneva Tirumala Visit, Pawan Kalyan Wife Donation, Mark Shankar Pawan Kalyan, Tirumala Suprabhata Seva
http://www.teluguone.com/news/content/anna-lezhneva-tirumala-visit-36-226369.html





