అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇరాన్

Publish Date:Apr 4, 2026

Advertisement

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానాన్ని తమ గగనతలంలో కూల్చివేసినట్లు ఇరాన్  ప్రకటించింది. ఈ ఘటనలో విమానం నుంచి పారాచూట్ ద్వారా బయటపడిన అమెరికా పైలట్‌ను పట్టుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఏకంగా భారీ రివార్డును ప్రకటించింది. శత్రు దేశ పైలట్‌ను సజీవంగా బందీగా పట్టుకుని భద్రతా దళాలకు అప్పగిస్తే భారీ మొత్తంలో నగదు బహుమతి ఇస్తామని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.

ఐఆర్జీసీ  సమాచారం మేరకు  నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ  స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా  ఇరాన్  రక్షణ వ్యవస్థలు దానిని   కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. ఇక ఈ కూల్చివేత ఘటనలో ప్రాణాలతో బయటపడిన అమెరికన్ పైలట్లను సజీవంగా బంధించేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. పైలట్ ను సజీవంగా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. సుమారు 60,000 డాలర్లు, భారత కరెన్సీలో 50 లక్షల రూపాయలు  బహుమతి అందజేస్తామని ఇరాన్ ప్రకటించింది.  

మరోవైపు, ఈ ఘటనపై అమెరికా వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విమానం కూలిపోయిన మాట వాస్తవమేనని, తమ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఒక పైలట్‌ను క్షేమంగా రక్షించాయనీ పేర్కొంది.  రెండో పైలట్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదనీ  గాలింపు సాగుతోందనీ తెలిపింది.  

By
en-us Political News

  
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినాదించిన మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల అసెంబ్లీ అన్నఆయన ఆశయానికి సజీవ రూపంగా నిలవనుంది.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీలకు తావులేకుండా, దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారు. కార్డు ముందరి భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్  ఆధారిత హోలోగ్రామ్ వంటి రక్షణ అంశాలను పొందుపరిచారు.
పుష్కరాల సందర్భంగా రాష్ట్ర  సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది.  ఇందులో భాగంగా  సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది.  
అమెరికా సైనిక పాటవానికి, అత్యాధునిక నిఘా సాంకేతికతకు నిదర్శనంగా నిలిచే శక్తిమంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ వ్యవస్థపై ఇరాన్ దాడి తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల బలగంలో  25 శాతం డ్రోన్లు ధ్వంసమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.