చట్టాలు కాగితాలకే పరిమితమా? క్షేత్రస్థాయిలో న్యాయం అందని ద్రాక్షేనా?

Publish Date:Apr 26, 2026

Advertisement

 

దేశంలో చట్టాలు అత్యంత పటిష్టంగా, లోతైన విశ్లేషణతో రూపొందాయనడంలో సందేహం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల నుంచి క్రిమినల్, సివిల్ చట్టాల వరకు ప్రతి అంశం కాగితంపై చాలా స్పష్టంగా, పటిష్టంగా ఉంటుంది. అయితే ఈ చట్టాలు క్షేత్రస్థాయిలో సమాన్యులకు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.   చట్టం బలంగా ఉంటుంది. అయితే  సమస్య ఏమిటంటే దాని అమలు మాత్రం అత్యంత బలహీనం.  కష్టంగా ఉన్నా ఇదే చేదు నిజం.  చట్టానికి, సమాజానికి  మధ్య అగాధం న్యాయవ్యవస్థపై   నమ్మకాన్ని దెబ్బతీసేదిగా పరిణమిస్తోంది.  దేశంలో చట్టాలు  ఐడిలిస్టిక్  కోణంలో రూపొందుతాయి తప్ప.. రియలిస్టిక్ గా కాదు అన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. 

 1961లోనే కట్న నిషేధ చట్టం తీసుకువచ్చనా..  2026 నాటికి కూడా వరకట్నం అన్నది  సామాజికంగా ఒక  ఆచారంగానే కొనసాగుతూనే ఉంది. అలాగే దేవాలయాల్లో నియమాలు కూడా,  కోర్టు తీర్పులు ఎన్ని ఉన్న..  ప్రజలు  సాంప్రదాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే చట్టాలు సమాజాన్ని పై నుంచి మార్చాలని చూస్తున్నాయి తప్ప, క్షేత్ర స్థాయిలో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రజలలో  మార్పు తీసుకురావడంలో విఫలమవుతున్నాయి.  భారత సమాజం చట్టం కంటే భయానికి, నీతికి ఎక్కువగా లొంగుతుంది. పేద వర్గాల్లో  దేవుడి భయం,  పాపం  అనే భావనలు వారిని నైతికతకు కట్టుబడి ఉండేలా చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా, సంపన్న, విద్యావంతులలలో  విద్యావంతులైన మాత్రం అది కనిపించడం అరుదు. వీరిలో  చట్టం పట్ల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది.    సిస్టమ్‌ను మేనేజ్ చేయవచ్చు,  లేదా  ఒక లాయర్‌ను పెట్టుకుని కేసును ఏళ్ల తరబడి సాగేలా చేయవచ్చ అన్న ధీమాయే వీరిలో చట్టం పట్ల భయం, గౌరవం తగ్గిపోవడానికి కారణమౌతోంది.  ఫలితంగా..  చట్టం ద్వారా నిజమైన నియంత్రణ అనేది కానరావడంలలేదు. 

భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పెరిగిపోతున్న పెండింగ్ కేసులు. ఇవి గుట్టల్లా..  కాదుకాదు కొండల్లా పేరుకుపోతున్నాయి.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా   5.6 కోట్ల కేసులు పెండింగ్‌ ఉన్నట్లు అంచనా. వీటిలో  85 శాతం కేసులు దిగువ కోర్టుల్లోనే మగ్గిపోతున్నాయి. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు దశాబ్దాల పాటు సాగడం వల్ల తరతరాల జీవితాలు కోర్టుల చుట్టూ తిరగడంలోనే గడిచిపోతున్నాయి.  ఆశ్చర్యకరంగా, సగానికి పైగా కేసుల్లో ప్రభుత్వమే ఒక పక్షంగా ఉండటం వ్యవస్థపై అదనపు భారాన్ని పెంచుతోంది. న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నప్పటికీ..  వాటిని అమలు చేసే సొంత యంత్రాంగం  కోర్టులకు లేదు. కోర్టు తీర్పు అమలు కావాలంటే పోలీసు,  రెవెన్యూ శాఖల మీద ఆధారపడాల్సిందే.  ఈ విభాగాలు అవినీతి, రాజకీయ ఒత్తిడి, పనిభారం వంటి వాటిలో కూరుకుపోయి ఉన్నాయి.   దీంతో  తీర్పు వచ్చినా బాధితుడికి న్యాయం అందడం లేదు. ఒక కేసులో గెలవడం అంటే సమస్య ముగియడం కాదు..  తీర్పు అమలు కోసం మరో కొత్త పోరాటం మొదలవ్వడమే అనే పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. 

మరోవైపు, కోర్టులు మౌలిక వసతుల కల్పనపై కంటే.. , సామాజిక, మతపరమైన అంశాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టు భవనాల్లో కనీస సౌకర్యాలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ వంటి వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.  ఈ జాప్యం కారణంగా ప్రజలు  న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి, అక్రమ పంచాయతీలు,  స్థానిక  స్ట్రాంగ్ మెన్    తీర్పుల వైపు మొగ్గు చూపుతున్నారు. కోర్టులో 20 ఏళ్లు తిరగడం కంటే, అక్కడే తక్షణ పరిష్కారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు. నిజమైన మార్పు రావాలంటే చట్టాల సంఖ్య కంటే వాటిలో స్పష్టత పెరగాలి. సామాన్యుడికి అర్థమయ్యేలా సరళమైన ప్రక్రియలు ఉండాలి. చట్ట ఉల్లంఘన జరిగితే శిక్ష పడుతుందనే భయం   కలగాలి.  ప్రభుత్వ లిటిగేషన్లను తగ్గించి, విచారణలు వేగంగా ముగిసేలా సంస్కరణలు చేపట్టాలి. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల మార్పు రాదు; గాంధీజీ వంటి సంస్కరణవాదులు చేసినట్లుగా సమాజం లోపల నుంచి మార్పు మొదలవ్వాలి. ఒక దేశ అభివృద్ధి కేవలం జీడీపీతో  కొలవలేము. చట్టం, నీతి,  దైనందిన జీవితం మధ్య ఉన్న అంతరం ఎంత తగ్గిందనేదే అసలైన అభివృద్ధి. చట్టం కేవలం కాగితంపై కాకుండా, సామాన్యుడికి భరోసా ఇచ్చే  వెపన్ గా మారాలి. అప్పుడే ఇండియా నిజమైన ప్రగతి సాధించినట్లౌతుంది.  

References 

https://indiajusticereport.org/indicator/319/ijr-3/all-states/table?utm_source=copilot.com 
https://en.wikipedia.org/wiki/List_of_scandals_in_India?utm_source=copilot.com 

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి.
అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది.
జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్‌లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.
తప్పుడు కేసుల వల్ల తాను ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న మానసిక వేదన, ఆర్థిక నష్టం, సామాజికంగా ఎదురైన అవమానాలకు గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకున్న అధికారులు తమ సొంత జేబుల నుంచే ఈ పరిహారం చెల్లించాలన్నారు. ఇది భవిష్యత్తులో ఏ అధికారి కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తోటి అధికారులపై తప్పుడు కుట్రలు చేయకుండా గుణపాఠంగా ఉండాలని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇండియా లక్ష్యంగా సాగుతున్న కేంద్రంగా సాగుతున్న పరోక్ష ( ప్రాక్సీ) యుద్ధవ్యూహాలు దక్షిణాసియా భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా.. దక్షిణాసియా మొత్తంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించడంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఎల్ఈటీ, జేఈఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కు తూటా తగిలింది.. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ధ్రువీకరించారు.
శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో పరుగుల సునామీ కాదు అంతకు మించి అన్నట్లుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇంత వరకూ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు మ్యాచ్ లలోనూ కలిపి ఏకంగా 986 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు సాధించడం ఇదే మొదటి సారి.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను ఏ విధంగా విస్తరిస్తున్నాయో తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా అత్యంత సురక్షితమని భావించే దేశాలలో కూడా పాక్ భూభాగం నుంచి తన కార్యకలాపాలను నిర్వహించే లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్ ఏ విధంగా చొరబడుతున్నాయన్నది ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని బాది రికార్డు సృష్టించాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ అర్ధసెంచరీ 51 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 218 పరుగుల భారీ స్కోరు చేసింది.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.