ఇషాన్, అభిషేక్ విధ్వంసం.. ఆర్ఆర్ పై ఎస్ఆర్హెచ్ సునాయాస విజయం
Publish Date:Apr 25, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 219 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు తమ విధ్వంస బ్యాటింగ్‌తో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని బాది రికార్డు సృష్టించాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ అర్ధసెంచరీ 51 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 218 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఈషన్ మలింగ రెండు వికెట్లు తీయగా, పునరాగమనం చేసిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ సాధించాడు. ఇక 219 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆరుపరుగులకే ఔటయ్యాయి. అయితే.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ రెండో వికెట్‌కు కేవలం 55 బంతుల్లోనే 132 పరుగుల పార్టనర్ షిప్ సాధించి మ్యాచ్ ను రాజస్థాన్ కు దూరం చేశారు. ఇషాన్ కిషన్ కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 29 బంతుల్లో 57 పరుగులు చేశారు. ఆ తరువాత నితీష్ కుమార్ 36 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మలు రెండేసి వికెట్ల పడగొట్టారు. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. అంతే కాదు ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది వరుసగా నాలుగో విజయం.
http://www.teluguone.com/news/content/srh-easy-win-over-rr-36-218289.html





