Publish Date:Apr 26, 2026
సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ బ్యూట అషు రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువకుడి నుంచి ఏకంగా 9.35 కోట్ల రూపాయల నగదు, ఆస్తులు కాజేసినట్లు ఆమెపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. కేవలం అషు రెడ్డిపైనే కాకుండా, ఈ మోసానికి సహకరించినట్లు ఆమె కుటుంబ సభ్యులపై కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన ఎనుముల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2018లో ధర్మేంద్ర హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో అతడికి అషు రెడ్డితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అషు రెడ్డి నమ్మించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, అషు రెడ్డి సోదరి కూడా ధర్మేంద్ర నుంచి సుమారు 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. 2018 నుంచి 2025 వరకు వివిధ రూపాల్లో సుమారు 9.35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, నగదు, దాదాపు 5 కిలోల బంగారాన్ని అషు రెడ్డికి ఇచ్చినట్లు సత్యనారాయణ ఆరోపించారు. చివరకు పెళ్లి ప్రస్తావన వస్తే సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో తాము మోసపోయామని గ్రహించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై బాధితుడు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించగా, కేసు తీవ్రత దృష్ట్యా దీనిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) కు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు అషు రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె బ్యాంక్ లావాదేవీలు, గత కొన్నేళ్లుగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా దీనిపై అషు రెడ్డి ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cheating-case-filed-against-bigg-boss-beauty-anshu-reddy-36-218314.html
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.