ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్ ప్రొఫెసర్ మృతి.!

Publish Date:Jul 30, 2026

Advertisement

దేశంలోనే ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో  ఓ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. 36 ఏళ్ల యువ శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి తన  నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. దీపక్ రెడ్డి స్వస్థలం హైదరాబాద్.  విద్యా రంగాన్ని, విద్యార్థి లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెలుగు రాష్ట్రానికి చెందిన   ప్రతిభావంతుడైన యువ ప్రొఫెసర్,  అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది.  క్యాంపస్‌లోని బి-టైప్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ప్రొఫెసర్ దీపక్ రెడ్డి గురువారం (జులై 29) మధ్యాహ్నం వరకూ కూడా తన నివాసం నుంచి  బయటకు రాకపోవడంతో తోటి సిబ్బందికి, పొరుగువారికి అనుమానం వచ్చింది. తలుపులు బాది, గట్టిగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో,   క్యాంపస్ భద్రతా సిబ్బంది,  స్థానిక పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు.

లోపల  ప్రొఫెసర్ దీపక్ రెడ్డి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో  అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.  పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు.  ప్రొఫెసర్ దీపక్ రెడ్డి మృతి పట్ల ఖరగ్ పూర్ ఐఐటీ యాజమాన్యం తీవ్ర సంతాపం ప్రకటించింది.  

IIT Kharagpur, Deepak Reddy Pullaguram, Hyderabad professor death, IIT Kharagpur suicide

By
en-us Political News

  
ప్రభుత్వ పాఠశాలలో విషసర్పం కాటుకు ఎనిమిదేళ్ల విద్యార్థి బలి..!
హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్‌ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.