చిరంజీవి రాష్ట్రంలో ఉంటేనే కాంగ్రెసుకు మేలు

Publish Date:Mar 20, 2012

Advertisement

హైదరాబాద్: చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్ర మంత్రిగా తీసుకోవడం వల్ల కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో మెగా అవకాశాన్ని కోల్పోతున్నట్లు భావిస్తున్నారు. చిరంజీవి రాష్ట్రంలో ఉంటేనే కాంగ్రెసుకు మేలు జరిగి ఉండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాంగ్రెసు నాయకులతో పాటు మాజీ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చిరంజీవిని రాష్ట్రంలోనే ఉంచాలని, దానివల్ల కాంగ్రెసుకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచనను సోనియా గాంధీ తిరస్కరించడంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. అయితే, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చిరంజీవిని రాష్ట్రంలో వాడుకోవచ్చుననే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విషయంపై ప్రశ్నిస్తే - ఆ విషయంపై తనకు వ్యక్తిగతాభిప్రాయం లేదని, సోనియా గాంధీ ఏది చెప్తే తాను అది చేస్తానని, తన భవిష్యత్తు సోనియా చేతులో ఉందని చిరంజీవి అన్నారు.


మరోవైపు, రాజ్యసభ ఎంపిక విధానం సీమాంధ్ర కాంగ్రెసు నేతలలో అసంతృప్తి రగిల్చిందని తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో పాల్వాయి గోవర్దన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, రేణుకా చౌదరి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఒక్క చిరంజీవి మాత్రమే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. దీంతో రాజ్యసభ ఎంపిక విషయంలో అధిష్టానం సమతుల్యత పాటించలేదని సీమాంధ్ర నేతలు ఒకింత అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. నాలుగింటిలో మూడింటిని తెలంగాణ వారికే ఇవ్వడం సరికాదని వారు అంటున్నారు. చిరంజీవికి రాజ్యసభ పదవి కేటాయించినప్పటికీ ఆయనను సీమాంధ్ర వ్యక్తిగా చూడటం సరికాదని నేతలు అభిప్రాయపడుతున్నారట.

By
en-us Political News

  
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన  వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు.
ఒక వివాహేతర సంబంధం ఇద్దరి జీవితాల్లో మొదలైన వివాదాన్ని.. ఏకంగా ఇరువర్గాల మధ్య గొడవగా మార్చింది.
ఊరేగింపులో భాగంగా భారీ విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాన్స్‌పోర్టర్   వాహనం సమీపంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు  వాహనం కింద పడిపోయాడు. అక్కడున్న వారు గమనించి, స్పందిం చేలోపే ఆ యువకుడి పైనుంచి వాహనం దూసుకెళ్లడంతో  తీవ్రంగా గాయపడి మరణించాడు.
హోరాహోరీ వేలంలో సామ ప్రణీత్ రెడ్డి .39 లక్షల రూపాయల రికార్డు ధరకు బాలాపూర్ గణేశుడి లడ్డూ  సొంతం చేసుకున్నారు.    ప్రతి ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సాగుతున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈ సారి మరో కొత్త రికార్డు సృష్టించింది
చివరి నిమిషంలో చేపట్టవలసిన కొన్ని సాంకేతిక వెల్డింగ్ పనులు, తదితర ముగింపు ఏర్పాట్ల కారణంగా ఉదయం యాత్ర ఆరంభం కావడంలో ఒకింత జాప్యం జరిగింది. అయితే ముందుగా నిర్ణయంచిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుని నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా పూర్తవుతుందని అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు.  
ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేస్తున్న  ప్రజా సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానాలకు గాను ఆర్యడన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కారానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. 
దీనికి తోడు.. ఏయే జిల్లాల పరిధిలోని భూముల గురించి విచారణ జరుగుతుందో, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆయా కేసుల విచారణ సమయంలో ఈ కమిటీలో సభ్యులుగా భాగస్వాములు అవుతారు.   అసెంబ్లీలో  రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-ఏ కింద జరిగిన చర్చల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది.
తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియను ఎంతోకాలంగా వేధిస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాజకీయ ఫిరాయింపులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.