Publish Date:Feb 27, 2012
హైదరాబాద్: రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే అనే నానుడికి అతికినట్టుగా సరిపోతుంది సేనియర్ నేత మాకినేని పెదరత్తయ్య తాజా పరిస్థితి. తెలుగుదేశంపార్టీలో తిరుగులేని నేతగా ఓ వెలుగు వెలిగి అ పార్టీ రాజకీయాలను శాసించిన మాకినేని రాజకీయంగా వేసిన తప్పటడుగులు కారణంగా ప్రస్తుతం ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది ఆయన భవిష్యత్తు. సుదీర్ఘకాలం పనిచేసిన తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించలేదంటూ దాదాపు ఏడాదిక్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాకినేని కొంతకాలం మౌనంగా ఉండి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరారు. ఆయన అక్కడ కూడా ఇమడలేకపోయారు. తన రాజకీయ శత్రువైన రావి వెంకటరమణకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని రత్తయ్య సహించలేకపోయారు. దీంతో రత్తయ్య జగన్ పార్టీ కార్యకలాపాలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వచ్చారు. అంబటి రాంబాబు తన శిష్యుడైన జంగా కృష్ణమూర్తి వంటివారు పలుమార్లు రత్తయ్యతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారు. అయితే అ పార్టీ హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. తెలుగుదేశం పార్టీలోని అంతర్గత రాజకీయాలు రత్తయ్య ఆగమనానికి అడ్డుగోడలుగా నిలిచాయి. రత్తయ్య తిరిగి పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్న భయం కూడా కొందరు టిడిపి పెద్దల్లో ఉంది. ఈ కారణంగా రత్తయ్య రాకను వారు త్రీవంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో రెండింటికీ చెడ్డ రేవడిలా మారింది రత్తయ్య పరిస్థితి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-24-12231.html
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.