రెండు బెర్త్‌లు ఖాయం..చిరును కూల్ చేసిన ఆజాద్
Publish Date:Jan 5, 2012
Advertisement
హైదరాబాద్: పార్టీని విలీనం చేసి ఆపద్భాంధవుడిగా నిలిచిన చిరంజీవికి హైకమాండ్ ఎలాంటి గౌరవం ఇస్తుందో మరోసారి రుజువైంది. హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. తో దాదాపు అరగంటపాటు ఏకాంతంగా మాట్లాడారు. ఈ ఉదయం ఆజాద్‌కు ఆల్పాహార విందు ఇవ్వనున్నారు. పదవుల పందేరంపై అలకపాన్పు ఎక్కిన చిరంజీవి ఆజాద్ టూర్లో గుంబనంగా వ్యవహరించారు. ఇక్కటి పర్యవసానాలను ఇట్టే పసిగట్టిన ఆజాద్ చిరును కూల్ చేశారు. బిజీ షెడ్యూల్లోనూ మెగాస్టార్‌కు సమయం కేటాయించారు. పార్టీ విలీనం సందర్భంగా ఇచ్చిన హామీల అమలు తీరుపై గుస్సామీదున్న చిరును గులాంనబీ తన తీరుతో కూల్ చేశారు. పీఆర్పీ మంత్రి పదవుల పందేరం నెలనెలా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో చిరు వర్గం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అటు జనంలోనూ చిరు ఇమేజ్ డ్యామేజవుతోంది. సంక్రాంతి తర్వాత కిరణ్ మంత్రి వర్గంలోకి ఇద్దరు పీఆర్పీ ఎమ్మెల్యే లకు బెర్త్ కన్ఫం అయింది. ఈనెల 23న వారి ప్రమాణ స్వీకారం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈనెల 21న సమన్వయ కమిటీ మలివిడత భేటీ తర్వాత ఉంటుందని అయితే కేవలం చిరు వర్గాన్ని తీసుకోవడమే తప్ప... మార్పులు చేర్పులు ఉండదంటున్నారు. అటు కేంద్రంలోను ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత చిరును కేబినెట్లోకి తీసుకునే ఛాన్సుంది.
http://www.teluguone.com/news/content/hyderabad-24-10659.html





