ప్రశ్న రావణ్ కేసులో హైడ్రామా.. కేసు వాదించనన్న జడ శ్రవణ్.. కారణమేంటంటే?

Publish Date:Jul 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్యకర దూషణల సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు  పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై తీవ్రమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన పలువురిని పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే  ప్రశ్న రావణ్  గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన  వివాదాస్పద యూట్యూబర్ బచలకురి జోసెఫ్‌ను పిఠాపురం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యంత అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినందుకు గానూప్రశ్న రావణ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ..  ఇతర పాత కేసుల కారణంగా పోలీసులు ఆయనను  మళ్లీ అదుపులోకి తీసుకుంటున్నారు.

ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.  అయితే.. ప్రశ్న రావణ్ కుటుంబ సభ్యులు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ను కలివడం జడ శ్రీవణ్ కు ఆగ్రహం కలిగేలా చేసింది.  శుక్రవారం(జులై 3)   ప్రశ్న రావణ్‌ను ఆసుపత్రి నుంచి నేరుగా మచిలీపట్నం కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. దానికి సంబంధించిన కేస్ రికార్డులను జుడీషియల్ అధికారులకు సమర్పించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కోర్టు ప్రాంగణంలో ఒక అనూహ్య పరిణామం సంభవించింది.

ప్రశ్న రావణ్ కుటుంబ సభ్యులు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రహస్యంగా కలిశారన్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన  జడ శ్రవణ్  ఈ కేసులో ప్రశ్న రావణ్ తరఫున తాను ఇకపై వాదించబోనని, ఈ కేసు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని కోర్టు ప్రాంగణంలోనే బహిరంగంగా ప్రకటించారు. ప్రధాన న్యాయవాది ఇలా హఠాత్తుగా తప్పుకోవడంతో కోర్టు వద్ద తీవ్ర గందరగోళం  నెలకొంది. రావణ్ కుటుంబ సభ్యులు జడ శ్రవణ్‌ను బ్రతిమిలాడినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ హైడ్రామా నడుమ అర్ధరాత్రి దాటిన తర్వాత మచిలీపట్నం కోర్టు ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ట్విస్ట్‌లు అక్కడితో ముగిసిపోలేదు. బెయిల్ వచ్చిన వెంటనే, అనకాపల్లి పోలీసులు మరో పాత కేసులో ప్రశ్న రావణ్‌ను మళ్లీ తమ కస్టడీలోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

High drama, Prasna Ravan case, Prashna Ravan, Jada Sravan Kumar, YS Jagan, Machilipatnam Court

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.