హైదరాబాద్‌లో భారీ వర్షం అలర్ట్.. ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు..!

Publish Date:Jul 30, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు, రహదారు లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలోని అన్ని కంపెనీలు, సంస్థలకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేశారు. 

వీలైనంత వరకు ఉద్యోగు లకు వర్క్‌ ఫ్రం హోం (WFH) అవకాశం కల్పించాలని సూచిం చారు. అత్యవసరంగా కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగుల విషయంలో కూడా 30 జూలై 2026న మధ్యాహ్నం 2 గంటల నుంచి దశలవా రీగా ఎర్లీ లాగ్‌అవుట్‌ చేయాలని కంపెనీలను కోరారు. భారీ వర్షాల సమయంలో ఉద్యోగుల ప్రయాణాన్ని తగ్గించడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడంతో పాటు రహదారులపై ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు. 

అదే సమయంలో అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ నిర్వహణ చేపట్టేం దుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే ఆయా సంస్థలు తమ కార్యాలయ ప్రాంతం, ఉద్యోగులను ఎప్పుడు ఎర్లీ లాగ్‌అవుట్‌ చేయ నున్నారనే వివరాలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ట్రాఫిక్‌ పోలీసులు ఇచ్చే సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.

 నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వర్ష సూచనలకు అనుగుణంగా తమ రోజువారీ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్లలో ట్రాఫిక్ పరిస్థితులను సీపీ వీసీ సజ్జనర్ స్వయంగా పరిశీలించారు. వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచే స్తోందని సీపీ తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద భారీగా నీరు నిలిచే అవకాశం ఉన్నం దున వాహనదారులు వేగాన్ని తగ్గించి అత్యంత జాగ్రత్తగా ప్రయాణించా లని సూచించారు.వర్షం కురుస్తున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభా లకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. 

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప వర్షం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ట్రాఫిక్ సహాయం అవసరమైనప్పుడు డయల్ 100ను సంప్రదించాలని సీపీ సూచించారు. నగర ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా, ఇతర మాధ్య మాల ద్వారా ఎప్పటిక ప్పుడు విడుదల చేసే ట్రాఫిక్ అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించా లని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. పోలీసుల సూచనలు, ట్రాఫిక్ ఆంక్షలను పాటించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకో వాలని సీపీ వీసీ సజ్జనర్ కోరారు

Heavy rain alert in Hyderabad, IT companies, Telangana Rains, Telangana Weather Update, CP VC Sajjanar, GHMC, Cyberabad
 

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.