వాద్రా తడాఖా – హర్యానా ఐఎఎస్ బదిలీ
Publish Date:Oct 17, 2012
Advertisement
సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా భూకుంభకోణానికి సంబంధించిన కేసులో విచారణకు ఆదేశించిన ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కాని హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. వాద్రా డీల్స్ ని రద్దు చేసిన నేరానికి నిజాయతీపరుడైన ప్రభుత్వాధికారికి దక్కిన గౌరవమిదని మీడియా దుమ్మెత్తిపోస్తోంది. నిబంధనల్ని పూర్తిగా తుంగలో తొక్కిన హర్యానా సర్కారు అడ్డగోలుగా ఖేమ్మా సీటుని మార్చేసింది. డిఎల్ ఎఫ్ తో వాద్రా ఒప్పందాన్ని తప్పుపట్టి దాన్ని రద్దు చేయడం ఖేమ్మా చేసిన నేరం. గడచిన 19 సంవత్సరాల్లో ఖేమ్మా 46 సార్లు బదిలీ అయ్యారు. నిజాయతీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ఖేమ్కాకి దక్కిన బహుమానమిదే. భారత్ లో నిజాయతీపరులైన ఆఫీసర్లకు ఏమేరకు గౌరవమర్యాదలు దక్కుతాయో ఖేమ్మాని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
http://www.teluguone.com/news/content/haryana-ias-officer-transferred-24-18269.html





