అసెంబ్లీ వద్ద హరీష్‌రావు అరెస్ట్‌.!

Publish Date:Sep 7, 2026

Advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిల విడుదలను డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీష్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి  తరలించారు.హరీష్‌రావుతో పాటు ఉప్పల్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన అరెస్టుకు నిరసనగా హరీష్ రావు తాను వేసుకువచ్చిన నల్ల టీషర్లు విప్పేసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసన కార్యక్రమాలపై నిషేధం నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలపై ఆందోళనలు చేపట్టాలని ఆదివారం (సెప్టెంబర్ 6) ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు అసెంబ్లీ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. హరీష్ అరెస్టుతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

అంతకు ముందు..గన్ పార్క్ వద్ద అమరవీరుల స్ఫూపానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సబ్డండ వర్ణాలనూ మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామంటూ 420 హామీలను గుప్పించిన  కాంగ్రెస్.. వెయ్యి రొజులు దాటినా వాటి గురించి మాట్లాడటం లేదని కేటీఆర్ విమర్శించారు.   

ఇలా ఉండగా హరీష్ రావు అరెస్టుపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేక అక్రమ అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం అప్రజాస్వామికమని విమర్శించారు.  మహిళా సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం అన్నారు.

అసెంబ్లీ వద్ద పెద్ద సంఖ్యలోపోలీసులను మోహరించి, సభకు వస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకే బీఆర్ఎస్ సభ్యులు నల్ల టీ షర్టులతో సభకు వచ్చారన్నారు. సభలోకి వెళ్లడానికి ముందే అరెస్టులు చేయడం దుర్మార్గమన్న తలసాని శ్రీనివాసయాదవ్.. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బ్లాక్ టీషర్ట్ లో లోక్ సభకు వెళ్లవచ్చు కానీ, బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి రాకూడదా అని నిలదీశారు.  

[Harish Rao Arrest, Telangana Assembly, Talasani Angry, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.