అజామాబాద్‌ భూమి కేటాయింపు రద్దు చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్‌..!

Publish Date:Aug 30, 2026

Advertisement

 

రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధీనంలో ఉన్న సుమారు 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.500 కోట్ల విలువైన ఈ భూమిని కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేటు వ్యక్తికి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ సంస్థను కాదని ప్రైవేటు వ్యక్తికి భూమిని అప్పగించడానికి గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేటు సంస్థకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ప్రభుత్వ హక్కును నిర్ధారించిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆ తీర్పును పట్టించుకోకుండా భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రైవేటు శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పేదలపై ఒత్తిడి పెంచుతూ.. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అప్పగిస్తోందని విమర్శించారు.

సామాన్యుల ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటుకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు.

అజామాబాద్‌ భూముల వ్యవహారం ఒక్కటే కాదని.. కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ దందా కొనసాగిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ పోతే.. భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం గుడి, బడి, చివరకు శ్మశానానికి కూడా ప్రభుత్వ భూమి మిగలదని వ్యాఖ్యానించారు.

అజామాబాద్‌ భూమికి సంబంధించిన కేటాయింపును తక్షణమే రద్దు చేసి.. భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్‌ హక్కులు కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


Harish Rao,  CM Revanth Reddy, Telangana Government, BRS, Ajampabad Land, Azamabad Land, Oilfed Land, Hyderabad Land, Hyderabad Government Land, Government Land, Land Allocation, Private Land Allocation

By
en-us Political News

  
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.