కాంగ్రెస్ మాజీ సీఎంకు బీజేపీ సర్కార్ జీవితకాల కేబినెట్ హోదా

Publish Date:Jan 8, 2022

Advertisement

ప్రతాప్ సింగ్ రాణే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఒకటి రెండు కాదు ఏకంగా పది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలిసారిగా 1972లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1980-2007 మధ్య ఆరుసార్లు (16 సంవత్సరాలు) ముఖ్యమంత్రిగా, 2007-2012 మధ్య అసెంబ్లీ స్పీకర్గానూ సేవలు అందించారు. ఆయన వయసు 83 ఏళ్ళు ... అయినా ఇంకా క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మరో  రెండు మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయన టికెట్ కేటాయించింది. ప్రతాప్ సింగ్ సొంత నియోజక వర్గం ‘పొరియమ్’  నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయనే పోటీ చేస్తారని కాంగ్రెస్ తొలి జాబితాలోనే ఆయన పేరును ప్రకటించింది. కానీ, ఇంతలోనే, కథ కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల్లో పోటీ చేయకుండానే, జీవితకాల కేబినెట్ హోదా దక్కింది. 

విషయంలోకి వస్తే ప్రతాప్ సింగ్ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరోసారి కూడా కాంగ్రెస్ తరఫున రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ప్రతాప్సింగ్ ప్రకటనకు ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే అడ్డు పుల్ల వేశారు. 83 ఏళ్ల వయసులో ఇంకా రాజకీయాల్లో కొనసాగడం ఎందుకు? ఆరు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలే గాని, ఓటమి పాలై పదవీ విరమణ పొందడం సరికాదు, అంటూ ఆయన్ని ఎన్నికల బరిలోంచి తప్పించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి పోటీకి విశ్వజిత్ రాణే సిద్ధమవుతున్నారు. 

ఇదలా ఉంటే గోవా ప్రభుత్వం ఆయనకు జీవితకాల కేబినెట్ హోదా ప్రకటించింది. గోవా రాష్ట్రానికి విశేష సేవలు అందించిన ప్రతాప్ సింగ్ రాణేకు జీవితకాలం కేబినెట్ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గోవా ముఖ్యమంత్రి, ప్రమోద్ సావంత్ ప్రకటించారు.  గత 50 ఏళ్లగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న ప్రతాప్.. ముఖ్యమంత్రిగా, స్పీకర్ గా సేవలు అందించారు. ప్రతాప్ సింగ్ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రమోద్ సావంత్, జీవితకాలం కేబినెట్ హోదా ద్వారా రాణేకు ఓ మంత్రికి అందే గౌరవం, అన్ని సౌకర్యాలు లభించనున్నాయి.

అయితే, బీజేపే ప్రభుత్వం నరనరాన కాంగ్రెస్ రక్తం నింపుకున్న ప్రతాప్ సింగ్ రాణేకు జీవితకాల కేబినెట్ హోదా ఇవ్వడం కొంత ఆశ్చర్య పరిచే విషయం అయితే ఆయన ఈ వయసులో పదవికి ఆశపది పార్టీకి పంగనామాలు పెట్టడం మరింత విశేషం అంటున్నారు.   అయితే  ఇంతకీ ఆ గౌరవం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇచ్చినట్లా .. ఆయన కుమారుడు, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్ల్యే చిన్న రాణేను సంతృప్తి పరిచేందుకా .. అదీ కాకపోతే, కాంగ్రెస్ ఖాతాలోంచి ఒక సీటును మైనస్ చేసేందుకా? అంటే మూడోదే ముఖ్య కారణం. అయినా మూడుకు మూడు కారణాలుగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.