ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు గానూ ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించగా ఆ పార్టీ తమ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ఎంపిక చేసింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం కూడా ఇద్దరు అభ్యర్థుల ఖరారు సజావుగా సాగిపోయింది. మూడో అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానం సమయం తీసుకుని మరీ చింతకాయల విజయ్ ను ఖరారు చేసింది. ఈ స్థానం కోసం చివరి నిముషం వరకూ టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పోటీ పడ్డారు. చివరికి పార్టీ అధినేత చంద్రబాబు చింతకాలయ విజయ్ కే మొగ్గు చూపారు. ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది. అందుకే ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్, హిందీ భాషలపై మంచి పట్టున్న నాయకుడు. ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాతో మాట్లాడాలన్నా, పార్లమెంట్ లో పాయింట్ టు పాయింట్ వాదించాలన్నా విజయ్ లాంటి యంగ్ అయితేనే కరెక్ట్ ఆప్షన్ అని భావించి ఆయనను చంద్రబాబు రాజ్యసభకు ఎంపిక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు.. సోషల్ మీడియా వేదికగానూ, క్షేత్రస్థాయిలోనూ టీటీడీ వాయిస్ ను ఐటీ వింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. రాబోయే రోజుల్లో పార్టీని నడిపించే నెక్స్ట్ జనరేషన్ నాయకులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు చింతకాయల విజయ్ కు రాజ్యసభ ఇచ్చినట్లు చెబుతున్నారు.
అలాగే.. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో చింతకాయల అయ్యన్నపాత్రుడి కుటుంబం పాత్ర ఉంది. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఇప్పుడు చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా జాతీయ స్థాయిలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత ఇఇచ్చినట్లు అవ్వడమే కాకుండా.. ఉత్తరాంధ్ర యువతకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద పీట వేసినట్లు అవుతుంది.
అదలా ఉంటే.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల విమర్శలను ఒంటిచేత్తో తిప్పికొట్టిన వర్ల రామయ్యకు అన్యాయం జరిగినట్లేనని పార్టీలోని కొందరు అంటున్నారు. అయితే.. "వర్ల రామయ్య గారి సీనియారిటీకి తగని గౌరవం ఇస్తూనే.. ఆయన సేవలను పారటీ రాష్ట్ర రాజకీయాలలోనే ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తోందని అధిష్ఠానం చెబుతున్నది. అలాగే . వర్ల రామయ్యకు ఎమ్మెల్సీగా అవకాశమో, కీలకమైన నామినేటెడ్ పదవో కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో యువనాయకత్వానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకునే చింతకాయల విజయ్ కు రాజ్యసభ చాన్స్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chintakayala-vijay-to-the-rajya-sabha-39-222133.html
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.