TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

రాజకీయాల్లోకి నా కుటుంబాన్ని లాగొద్దు: కొడుకు పోటీపై అక్బరుద్దీన్ క్లారిటీ.!

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగవద్దని స్పష్టం చేశారు. చాంద్రాయణగుట్ట నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది జమాత్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. జమాత్ పోటీ చేయాలని ఆదేశిస్తే బరిలోకి దిగుతానని, వద్దని చెబితే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. తన కుమారుడు చాంద్రాయణగుట్ట నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారంపైనా అక్బరుద్దీన్ స్పందించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రచారం చేసినవారే.. ఇప్పుడు తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన కుమారుడు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడని, అక్కడే కొనసాగుతాడని తెలిపారు. తన రాజకీయాలతో కుటుంబ సభ్యులకు సంబంధం కల్పించవద్దని కోరారు. తన రాజకీయ భవిష్యత్తుపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోనని, జమాత్ సూచనల మేరకే ముందుకు వెళ్తానని అక్బరుద్దీన్ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో చాంద్రాయణగుట్ట నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తారా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు, తన సేవా కార్యక్రమాల గురించి కూడా అక్బరుద్దీన్ కీలక విషయాలు వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి ముందే స్థానిక అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. వారి భవిష్యత్తుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పిల్లల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.2 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఏ ఒక్క వ్యక్తి చేసిన తప్పు కారణంగా మొత్తం పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించడం సరికాదని అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. వ్యక్తుల చర్యలను మొత్తం పార్టీకి ఆపాదించకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచింది తన నిజాయితీతోనేనని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలు, జమాత్ సూచనలకు అనుగుణంగానే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.మొత్తంగా, తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారంపై అక్బరుద్దీన్ స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై జమాత్ నిర్ణయమే కీలకమని వెల్లడిస్తూ.. తన కుటుంబాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని స్పష్టమైన సందేశం ఇచ్చారు. [ Akbaruddin Owaisi, AIMIM, AIMIM MLA, Akbaruddin Owaisi Latest News, Chandrayangutta, Akbaruddin Owaisi Son, Political Entry, Telangana Politics, Hyderabad Politics, Jamaat Decision, AIMIM Politics, Akbaruddin Owaisi Statement, Election News, Orphan Children, Rs 2 Crore Donation, Telangana News ]

Published on: Fri Oct 9, 2026 5:37PM

political-news-img

చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా అధ్యక్ష బాధ్యతలు: బొత్సకు చెక్.. ఇదే చంద్రబాబు వ్యూహమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పార్టీ మార్పులు, కొత్త సమీకరణాలతో వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైపీపీని జీరో చేయడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వేస్తున్న ఆడుగులు ఆసక్తికరంగా మారాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు పెట్టని కోట లాంటి విజయనగరం జిల్లాలో ఆయన పట్టు సడలే విధంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. వైసీపీ కీలక నాయకుడు, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను ఇటీవల వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే అదేదో మామూలు చేరికగా కాకుండా.. ఏకంగా విజయనగరం జిల్లా సారథ్య బాధ్యతలను ఆయనకు అప్పగించి వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. అయితే విజయనగరం జడ్పీ చైర్మన్ గా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన, జిల్లాలో మంచి రాజకీయ పలుకుబడి ఉన్న చిన్న శ్రీనును తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఆషామాషీది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిన్న శ్రీను గత నెలలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఆయన తో పాటు పలువురు ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా చిన్న శ్రీను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం గూటికి వచ్చినట్లు విస్పష్టంగా చెప్పారు. తన చేరికకు ఎటువంటి షరతులు, పదవుల ప్రలోభాలూ లేవని కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం గూటికి చేరిన తరువాత చిన్న శ్రీను వరుసగా ఆ పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ను ఆయన కలిసి జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే చిన్న శ్రీనుకు తెలుగుదేశం జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇందుకు చిన్న శ్రీనుకు జిల్లాపై ఉన్న పట్టు, పలుకుపడే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. చిన్న శ్రీనుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారానికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలే అనడంలో సందేహం లేదు. అదే గనుక జరిగితే విజయనగరంలో బొత్స హవాకు పూర్తిగా గండి పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [TDP Vijayanagaram President Chinna Srinu, Chandrababu Naidu, Chinna Srinu, Majji Srinivasa Rao, Vizianagaram TDP, TDP District President, Nara Lokesh, YCP to TDP,Telugu One]

Published on: Fri Oct 9, 2026 2:21PM

political-news-img

నాడు తెలుగుదేశం, బీజీపీల మధ్య చిచ్చు నా చలవే: విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

2019 ఎన్నికలకు ముందు అప్పటికి పొత్తులో ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది తానేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా 2018 నాటి రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు పార్టీఅ మధ్యా విభేదాలు పొడసూపి, అవి ముదిరి మైత్రిబంధం తెగిపోవడానికి 2016 నుంచి తాను ప్రయత్నాలు చేశాననీ, చివరకు ఆ ప్రయత్నాలు 2018 నాటికి ఫిలించాయని అప్పట్లో వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి తాజాగా చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఆయన తిరుపతిలో ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉండేది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై సైకిల్, కమలం పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. 2018లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు తెంచుకుని, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ పరిణామం అప్పట్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చివేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలను చేపట్టింది. నాటి పరిణామాలపై తాజాగా నోరు విప్పిన విజయసాయి రెడ్డి.. 2016 నుంచి 2018 వరకు టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెంచేందుకు తాను అనేక విధాలుగా ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. అలా దూరం పెంచి, ఆ రెండు పార్టీల పొత్తునూ విచ్ఛిన్నం చేయడంలో సక్సెస్ అయ్యాను కనుకనే.. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పకనే చెప్పారు. అప్పట్లో వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం సిద్ధించి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నది తానేనని విజయసాయి అన్యాపదేశంగా చెప్పారు. [Vijayasai Reddy Behind Differences Betweem BJP And TDP, Split, TDP BJP Alliance, 2018, YS Jagan Political Advantage, 2019 AP Elections,Andhra Pradesh Politics, Telugu One]

Published on: Fri Oct 9, 2026 9:34AM

political-news-img

తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.!

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీ్ు అధినేత విజయ్ ఎన్నికకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలోని మద్రాస్ హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపును సవాలు చేస్తూ దినేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై 53 వేల 715 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపిస్తూ దినేశ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణల ఆధారంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ తరఫున విజయ్‌కు సంబంధించిన కొన్ని ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వెల్లడించలేదని వాదించారు. ముఖ్యంగా పన్రుటి ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్న వ్యవసాయ భూమి విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందనీ, దాని వివరాల వెల్లడిపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కొడైకెనాల్‌లోని విల్పట్టి గ్రామంలో ఉన్నట్లు పేర్కొన్న 50 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి అయి ఉండవచ్చని రెవెన్యూ రికార్డులను ప్రస్తావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎన్నికల అఫిడవిట్‌లో అవసరమైన సమాచారాన్ని వెల్లడించామని, చిన్నపాటి లోపాలు లేదా వివరాలపై వివాదాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఎన్నికను రద్దు చేయలేమని వాదించినట్లు సమాచారం. ఆస్తుల వివరాలపై వచ్చిన ఆరోపణలు ఎన్నికల ఫలితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూపాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పిటిషన్‌పై తుది తీర్పు అక్టోబర్ 14న ప్రకటించనున్నట్లు కోర్టు తెలిపింది. అప్పటిలోగా సంబంధిత పక్షాలు తమ రాతపూర్వక వాదనలు సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం కోర్టు ముందున్న ప్రశ్న విజయ్ ఎన్నికను వెంటనే రద్దు చేయాలా అన్నది మాత్రమే కాదు; ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా, లేదా అన్న అంశంపైనా కోర్టు తీర్పు వెలువరించనుంది. [Verdict on Tamilnadu CM Vijay Election Case, Madras High Court, Perambur Constituency, Election Affidavit, Tamil Nadu Politics, October 14 Verdict, Telugu One]

Published on: Fri Oct 9, 2026 9:06AM

political-news-img

అప్పుడు బొద్దింకలకు జై: ఇప్పుడు మోడీకి జైజై.. కన్ఫ్యూజన్ లో జగన్.!

సింహం సింగిల్ గానే వస్తుందంటూ తన భుజాలను తానే చరచుకునే జగన్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, తాను కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆయనలోని అయోమయానికీ, కన్ఫ్యూజన్ కు అద్దంపట్టింది. గతంలో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తాను కూడా పోరాడే బొద్దింకనని జగన్ ప్రకటించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను కాక్రోచ్ ల ఉద్యమంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నానని విస్పష్ట సందేశాన్నిచ్చారు. జగన్ తన రాజకీయ జీవితంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం అదే ప్రథమం. దీంతో జగన్ ఇక తన పొలిటికల్ మార్గాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఆరంభిస్తున్నారా అన్న అనుమానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. దానికి కొనసాగింపుగానే జగన్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరౌతున్నారన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. ఇక సీపీఐ నేతలు ఆయనతో భేటీ కావడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చాయి కూడా. అయితే తాను ఏ కూటమిలోనూ భాగస్వామిని కాబోవడం లేదని జగన్ వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రస్థానం ( గుజరాత్ సీఎంగా, పీఎంగా) పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా జగన్ తన కన్ఫ్యూజన్ ను బయటపెట్టుకున్నారు. మోడీని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ లో ప్రజా సేవలో మోడీ చారిత్రాత్మక మైలు రాయిని చేరుకున్నారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పాతికేళ్లుగా నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ సోషల్ మీడియాలో ఓ సందేశం షేర్ చేశారు. నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒకే సమయంలో రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న రాజకీయ నాయకుడిగా జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. [YS Jagan Praises Narendra Modi, Jagan Modi Tweet, YCP, CJP, Andhra Pradesh Politics, Jagan Political Strategy, Duel Standards, Confusion, Telugu One]

Published on: Thu Oct 8, 2026 3:24PM

political-news-img

తమిళనాడు సీఎం విజయ్ తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ: ఎందుకంటే.?

విజయవాడలో జరగనున్న దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం(సెప్టెంబర్ 7) తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. ఈ ఆహ్వానంపై విజయ్ సానుకూలంగా స్పందించారని, ఆయన ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది జరిగి 24 గంటలు కాక ముందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమిళనాడు సీఎం విజయ్ తో భేటీ అయ్యారు. తన భర్త అనిల్ లో కలిసి చైన్నైలో విజయ్ ను కలిసిన షర్మిల తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్ ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షర్మిల స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయ్యింది. మొత్తంగా ఒక రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు సీఎం విజయ్ కు రెండు ఆహ్వానాలు అందడం విశేషం. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి. [YS Sharmil Meet Vijay Thalapathy, Tamil Nadu CM Vijay, AP Congress, Sharmila Vijay Meeting, Anjili Reddy Wedding, Vijay TVK, Andhra Pradesh Politics, Telugu One]

Published on: Thu Oct 8, 2026 3:00PM