వై.ఎస్. భూకేటాయింపుల రద్దుకు త్వరలో జి.వో.?
Publish Date:May 21, 2012
Advertisement
వై.ఎస్.రాజక్షేకరరేద్ది ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక ఆర్ధికమండళ్లకు, వివిధ పారిశ్రామిక సంస్థలకు కేటాయించిన లక్షలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ముందుగా వాన్ పిక్, బ్రహ్మణి స్టీల్స్ కు కేటాయించిన వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవ టానికి వీలుగా ఆ జి.వో.ను విడుదల చేయాలని నిర్ణయించి నట్టు తెలిసింది. ఉప ఎన్నికల పోలింగ్ కు ముందుగానే ఈ జి.వో.లను జారీ చేసే అవకాశముందని తెలిసింది. ఇప్పటికే కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్ కు కేటాయించిన 14వేల ఎకరాల భూములను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరుతూ ఆ సంస్థ యాజమాన్యాని కి పరిశ్రమల శాఖ నోటీసు జారీ చేసింది. అదే విధంగా తాజాగా వాన్ పిక్, లేపాక్షి, నాలెడ్జ్ కు ఇతర భూకేటాయింపులపైన న్యాయశాఖ అభిప్రాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. న్యాయ శాఖ ఒకే చెబితే వీటికి కూడా కొద్దిరోజుల్లోనే షోకాజ్ నోటీసు పంపే అవకాశముంది. భూకేటాయింపులు నిబంధనలకు విరుద్ధంగా అటు కోర్టు కానీ ఇటు రాష్ట్రప్రభుత్వం కానీ ఆ భూ కేటాయింపులను రద్దు చేయవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/go-to-cancel-land-allotments-in-ys-govt-24-14174.html





