మారని జి.హెచ్,ఎం.సి. పని తీరు
Publish Date:Oct 4, 2012
Advertisement
నిమజ్జనం జరిగి నాలుగు రోజులు గడచి పోయినా ఇంతవరకు హుస్సేన్ సాగర్‌ను క్లీనింగ్ పూర్తికాలేదు. అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సులో వేల మంది హైదరాబాద్‌కు వచ్చి ఉండగా కూడా జి.హెచ్,ఎం.సి. తన పనితీరును మెరుగు పరచుకోక పోవడం నగరవాసులకు ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్‌కు లాండ్ మార్క్ అయిన హుస్సేన్ సాగర్‌ను పరిశుబ్రం చేస్తేనే బుద్దవిగ్రహం దగ్గరకు వచ్చే విదేశీ అతిధులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఆరకొర చేసిన ఏర్పాట్లవల్ల మొన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యి గుంతలన్నీ నీటితో నిలచి పోయాయి. టూరిజానికి అందివచ్చిన అవకాశాన్ని గ్రేటర్ మున్సిపాలిటీ ఏ మాత్రం వినియోగించుకోలేక పోతుంది. ఇంతవరకు టూరిజంకోసం బస్సులుగాని ట్యాక్సీలను గాని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. హోటల్స్‌కు మాత్రం ఈ ఇరవైరోజుల్లో సుమారు 1500 కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా త్వరిత గతిని శుబ్రపరచి విదేశీ అతిధులకు రాష్ట్రం పై సదభిప్రాయం కలిగించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/ghmc-24-17889.html





