వానల కోసం కోనసీమలో కప్పలకు పెళ్లి!

Publish Date:Jun 18, 2026

Advertisement

రోహిణీ కార్తె వెళ్లిపోయింది. వర్షాలు దండిగా కురవాల్సిన మృగశిర కార్తె కూడా వెళ్లిపోయింది. అయినా చినుకు జాడ లేదు సరికదా.. ఎండలు మండిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక భూములు నెర్రలు వారుతున్నాయి. జూన్ నెల ముగిసిపోయేలా ఉన్నా తొలకరి పలకరించకపోవడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు.  ఉష్ణోగ్రతలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ   ఎండల దెబ్బకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకుని, మేఘాలు కరుణించేలా చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ కోససీమలోని ఓ గ్రామంలో గ్రామస్థులంతా కలిసి వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి కప్పలకు పెళ్లి చేశారు. 

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో,  వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో తమ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు.  ఎండలు తీవ్రంగా ఉండి వర్షాలు పడనప్పుడు కప్పలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తే వరుణ దేవుడు తప్పకుండా కరుణిస్తాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆ నమ్మకంతోనే వాడపాలెం గ్రామంలోని వంతెన సెంటర్ వద్ద  కప్పల పెళ్లి ' కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ప్రతి ఘట్టాన్ని గ్రామ పెద్దలు ఎంతో నియమనిష్టలతో జరిపించారు.

 హిందూ సాంప్రదాయ పద్ధతిలో  వధూవరుల వివాహం ఎలా జరుగుతుందో.. అచ్చం అలాగే..  అలాగే అన్ని ఆచారాలను పాటించారు.   రెండు ఆరోగ్యకరమైన కప్పలను పట్టుకొచ్చి, వాటిని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా భావిస్తూ.. . ఆ కప్పల జంటకు పసుపు, కుంకుమలు రాసి, రంగురంగుల పూల మాలలతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు. పురోహితులు ముహూర్త బలాన్ని నిర్ణయించి, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆ కప్పల జంటకు వివాహ వేడుకను పూర్తి చేశారు.

వివాహం ముగిసిన తరువాత.. ఆ  కప్పల జంటను ఒక ప్రత్యేక పల్లకిలో ఉంచి, డప్పులు, బ్యాండ్ మేళం, భాజాభజంత్రీలతో   గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో గ్రామ యువకులు ఎంతో ఉత్సాహంగా డప్పు దరువులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు. ప్రకృతి మాత కరుణించి, తమ పొలాలకు జీవం పోసేలా త్వరలోనే భారీ వర్షాలు కురవాలని గ్రామస్తులంతా ఈ సందర్భంగా వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్పల పెళ్లి వేడుకను కళ్లారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు    తరలివచ్చారు. సాంప్రదాయాలు, నమ్మకాల కలబోతగా సాగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తెగ ట్రెండ్ అవుతోంది.

By
en-us Political News

  
పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం..
హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ (NEET) పరీక్ష వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐపీఓ (Leapfrog Engineering SME IPO) నేటితో ముగియనుంది. తాజా సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), లాట్ సైజ్ మరియు కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి.
క్రెడిట్ కార్డ్ స్వైప్ ఛార్జీలు లేదా MDR అంటే ఏమిటి? 1% నుండి 3% వరకు ఉండే ఈ అదృశ్య రుసుములు మీ జేబును ఎలా ప్రభావితం చేస్తాయో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
బ్యాంకుల్లో లిక్విడిటీ నిల్వలు రూ. 4,772 కోట్లకు పడిపోవడంతో ఆర్‌బీఐ రూ. 1 లక్ష కోట్ల వేలాన్ని ప్రకటించింది. ఈ వేరియబుల్ రేట్ రెపో (VRR) వేలం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
లేబనాన్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన ఆలస్యం కావడం, $300 బిలియన్ల నిధిపై వివాదం మరియు హార్ముజ్ జలసంధి పరిణామాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ (PM SHRI) నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణం, విద్యార్థినుల కోసం 53 వేల బంక్ బెడ్ల ఏర్పాటు మరియు అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నారా లోకేష్ తీసుకున్న కీలక నిర్ణయాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో సౌత్ కొరియాపై 1-0 విజయం సాధించి, రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో సంచలన రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్టాక్ మార్కెట్ క్రాష్‌లోనూ అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3 శాతానికి పైగా దూసుకెళ్లాయి. ఒప్పో ఇండియాతో కుదిరిన మొబైల్ తయారీ ఒప్పందం ఈ భారీ ర్యాలీకి ఎలా కారణమైందో, ఈ మల్టీబ్యాగర్ రిటర్న్స్ వివరాలను ఇక్కడ చూడండి.
ప్రశాంతతకు మారుపేరైన విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జూన్ 19న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 780 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,000 స్థాయిని కోల్పోయింది. కేవలం నిమిషాల్లో రూ. 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఎలా ఆవిరైంది, యాక్సెంచర్ ఇచ్చిన షాక్ ఏంటి, ఐటీ షేర్లు ఎందుకు పతనమయ్యాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.