విశాఖలో రేపు ఏఐజీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్..!

Publish Date:Aug 30, 2026

Advertisement

 

ప్రపంచస్థాయి హెల్త్ కేర్.. అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్ ఏర్పాటు.. !

కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది. వైజాగ్ ప్రపంచస్థాయి మౌలిక మౌలిక వసతులు, పారిశ్రామికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖకు ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ(AIG) ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో ఏఐజీ హాస్పటల్స్ నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఆసుపత్రి ఏర్పాటు ద్వారా ఏపీ వాసులు ఇకపై హైదరాబాద్ వెళ్లే పనిలేకుండానే మెరుగైన వైద్యం రాష్ట్రంలోనే అందుబాటులోకి రానుంది. 

రూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేల మందికి ఉద్యోగాల కల్పన..!

విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశలవారీగా ఐదేళ్లలో 2వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. ఓపీడీ సేవలు రోజుకు 5వేలు ఉండనున్నాయి. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి చెందిన ఏఐజీ హాస్పిటల్స్.. విశాఖలో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటుచేయనుంది. 

ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ ను నెలకొల్పనుంది. మొదటి దశలో టవర్-ఏ, టవర్-బి నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నారు. రెండో దశలో టవర్-సి నిర్మాణాన్ని 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. ఔట్‌పేషెంట్ విభాగాన్ని రోజుకు సుమారు 5వేల మంది రోగులకు సంప్రదింపులు అందించే విధంగా రూపొందించారు.

50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలు ఏర్పాటు..!

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలు ఉండనున్నాయి. ప్రత్యేక మాతా శిశు విభాగం ఏర్పాటుచేయనున్నారు. ప్రత్యేకంగా కేటాయించిన 2.5 ఎకరాల ప్రాంగణంలో నర్సింగ్ కళాశాల, నర్సింగ్ సిబ్బంది కోసం హాస్టల్‌ నిర్మించనున్నారు. 

అనుబంధ ఆరోగ్య సేవలు, సాంకేతిక సిబ్బందికి పారామెడిక్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పనున్నారు. నిరంతర విద్యా కార్యకలాపాల కోసం 500 సీట్ల ఆడిటోరియం నిర్మించనున్నారు. క్లినికల్ వ్యవస్థలోనే రీసెర్చ్ ల్యాబ్, AI సెంటర్ ఏర్పాటుచేయడం జరుగుతుంది. విజిటింగ్ ఫ్యాకల్టీ, డాక్టర్స్ కోసం వసతి, రోగుల సహాయకులు, బంధువుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వసతి కల్పిస్తారు. ఆసుపత్రి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వెయ్యి మంది వైద్యులు సేవలందించనున్నారు.

వైద్యరంగంలో ఏఐజీ హాస్పిటల్స్ కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. హైదరాబాద్‌లో 3 యూనిట్లు, 1,400కు పైగా పడకలు, 350కు పైగా ICU పడకలు, 600కు పైగా వైద్యులు, హెల్త్ కేర్ నిపుణులు ఉన్నారు. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ యూనిట్‌కు ఏఐజీ హాస్పిటల్స్ నిలయంగా ఉంది.

 

Foundation stone for AIG Hospital to be laid tomorrow in Visakh, Minister Nara Lokesh, Dr. D. Nageshwar Reddy, Asian Institute of Gastroenterology, CM Chandrababu, Minister Satya Kumar Yadav

By
en-us Political News

  
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.