రగిలిపోతున్న దాసరి
Publish Date:Mar 20, 2012
Advertisement
కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఇటీవల కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో తీవ్రంగా రగిలిపోతున్నారు. మరోసారి రాజ్యసభ సీటుకోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడిన దాసరి నారాయణరావు తన సత్తా ఏమిటో కాంగ్రెస్ అధిష్టానానికి చూపాలనుకుంటున్నారు. దాసరికి, చిరంజీవికి మధ్య చాలాకాలంగా కోల్డ్ వార జరుగుతోంది. ఇద్దరూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతం నుంచే వచ్చినప్పటికీ వీరి మధ్య ఏమాత్రం సయోధ్యలేదు. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి ఒకరకంగా, అనంతరం పిఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మరో రకంగా తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశారనే అనుమానంతో దాసరి నారాయణరావు ఉన్నారు. అంతేకాక నిన్నగాక మొన్న పార్టీలో చేరిన చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు త్వరలోనే చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారన్న వార్తలు దాసరికి మరింత మంట పుట్టిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మరోసారి తన మానస పత్రిక ఉదయాన్ని తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేయబోతున్నారు. అంతేకాక కాంగ్రెస్ సంస్కృతీని ప్రతిబింబిస్తూ కాంగ్రెస్ నాయకులపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఉండేలా ఒక చలన చిత్రాన్ని కూడా ఆయన నిర్మించాలనుకుంటున్నారు. అయితే దాసరి నారాయణరావు తనకు గుర్తింపు లభించనప్పుడల్లా ఇలా బ్లాక్ మెయిల్ కు దిగడం సహజమేనని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దాసరి నారాయణరావు సుమారు 150 సినిమాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.
http://www.teluguone.com/news/content/former-union-minister-state-coal--mines-dr-dasari-narayan-rao-24-12772.html





