తెలుగు రాష్ట్రాలలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలోని ఐదు స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ నుంచి ఒకరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నిక్యారు. ఆమేరకు కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, అలాగే కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ లకు ఈసీ ధృవీకరణ పత్రం కూడా అంద జేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఐదు స్థానాలలోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులే ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ ఐదింటిలో ఒక స్థానాన్ని జనసేనకు, ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకూ తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ కూడా ఐదు స్థానాలకూ ఐదుగురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక్కాడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది.
దీంతో ఏపీలో తెలుగుదేశం కూటమి తరఫున ఎమ్మెల్సీలుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్, బీటీ నాయుడు, కొణిదల నాగేంద్రరావు (నాగబాబు), సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈసీ ప్రకటించి వారికి ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ ఐదుగురూ బుధవారం (ఏప్రిల్ 2)న ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత అసెంబ్లీ భవనంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/five-mlxs-swornin-in-ap-39-195472.html
ఇహనో.. ఇప్పుడో వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కానున్నారా? ఆంధ్రప్రదేశ్ సీఐడీ బృందాలు ఢిల్లీలో ఉండటానికి కారణం అదేనా. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ మంగళవారం(ఏప్రిల్ 7) విచారణకు రానుంది.
పిఠాపురంలో అసలేం జరుగుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకర్గం పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి.
అబుదాబీలోని బాప్స్ స్వామినారాయణ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అబుదాబీలోని బాప్స్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందిస్తారు. ఆ నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెడతారు. ఆ నష్టాన్ని నివారించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తారు.
తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టగానే తొట్ట తొలిగా తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించింది. వైసీపీ హయాంలో తిరుమల పారిశుద్ధ్యం సహా ప్రతి విషయంలోనూ అస్తవ్యస్థంగా తయారైంది. అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం నుంచీ, తిరుమల ప్రసాదంలో కల్తీ వరకూ నానా రకాలుగా భ్రష్టుపట్టించారు. దీంతో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టగానే తిరుమల పవిత్రతను కాపాడటంపై దృష్టి సారించింది.
వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఆదివారం ఓ వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కి తరలించినా ఫలితం లేకపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉ:ది. సోమవారం (ఏప్రిల్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు.
శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు
వైకాపా నేత , మాజీమంత్రి అంజద్ భాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. అహ్మద్ భాషాపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రేషన్ బియ్యం దళారులు చేతుల్లో వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం దొడ్డు బియ్యం. ఈ బియ్యం వండుకుని తినడానికి ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు.
తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు