తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టగానే తొట్ట తొలిగా తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించింది. వైసీపీ హయాంలో తిరుమల పారిశుద్ధ్యం సహా ప్రతి విషయంలోనూ అస్తవ్యస్థంగా తయారైంది. అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం నుంచీ, తిరుమల ప్రసాదంలో కల్తీ వరకూ నానా రకాలుగా భ్రష్టుపట్టించారు. దీంతో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టగానే తిరుమల పవిత్రతను కాపాడటంపై దృష్టి సారించింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమలలో పర్యటించిన చంద్రబాబు ఆ సందర్భంగా తిరుమల ప్రక్షాళన తొలి ప్రాథాన్యత అని చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే తిరుమల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారు. కొండపై హోటళ్లలో పారిశుద్ధ్యం, తినుబండారాలలో నాణ్యత పెంపు నుంచి మొదలు పెట్టి.. వరుసగా తిరుమలలో పవిత్రత పెంచే విధంగా వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా తిరుమల కొండపై వసతి గృహాలు, కాటేజీలలో శుభ్రద పెంపు, ఫిర్యాదుల పరిశీలన, గదుల కేటాయింపు తదితర విషయాలపై టీటీడీ దృష్టి సారించింది. టీటీడీ ఈవో శ్యామలరావు ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తులు టీటీడీ వసతి గృహాలను ఖాళీ చేసిన ఎంత సమయం తరువాత ఆ గదులను ఇతరులకు కేటాయిస్తున్నారు. గదులలో శుభ్రత, భక్తుల ఫిర్యాదులు వంటి సమాచారం వెంటనే తెలిసేలా యాప్ రూపొందించాలని ఆదేశించారు. గదుల కేటాయింపులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.
ప్రధానంగా తిరుమలలో భక్తులకు శీఘ్రదర్శనం, గదుల కేటాయింపు, శుభ్రత తదితర అంశాలపై ఇటీవల అధికారులతో చర్చించారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలనీ, లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద జాప్యం లేకుండా లడ్డూల పంపిణీ జరగాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/special-aap-to-observe-cleanliness-39-195731.html
కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణం బీహార్ లో జరిగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది.
ట్రేడ్ వార్‌లో అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది.
ఓటీటీలు వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అన్నది బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు సినిమా తప్ప వినోదానికి మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఇప్పుడు ఓటీటీ, మొబైల్స్ వంటివి థియేటర్ల ప్రాధాన్యాన్ని చాలా వరకూ తగ్గించేశాయి. ఒకప్పుడు కొత్త సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చేసేవారు.
పిఠాపురం వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపుతు తిరుగుతున్నాయి. గత ఎన్నికలలో కూటమి ధర్మానికి కట్టుబడి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తరువాత జరిగిన పరిణామాల పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులే కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతోంది.
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని నిందితుడు. ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ సిఐడి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది.
వరుస భూకంపాలతో తైవాన్ బెంబేలెత్తిపోతున్నది. గత నెల 28న సంభవించిన భూకంపం సృష్టించిన విలయం నుంచీ, మారణహోంమ నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం (ఏప్రిల్ 9) మరోసారి తైవాన్ లో భూమి కంపించింది.
రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది
జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. పాలిటిక్స్‌కు టెంపరరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు ఒక్కటొక్కటిగా అన్నీ కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పట్టాలెక్కనుంది.
ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో దారుణంగా నష్టపోతున్న రొయ్యాల రైతులు అక్వా సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆక్వా సంఘాలూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
మెట్రో రైలు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని తెలంగాణ సర్కార్ తిరిగి అదే నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ బుధవారం (ఏప్రిల్ 9) ఉత్తర్వలు జారీ చేశారు.
ఎఐసిసి చీఫ్ మల్లి ఖార్జున్ ఖర్గే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్ట పడి పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని నేతలపై చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమైంది. కష్టపడి పని చేసే వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు ఖర్గే చెప్పారు.