విదేశీ నిధుల అక్రమ దందాకు.. FCRA సవరణ బిల్లుతో ముగింపు పడేనా..?
Publish Date:Aug 7, 2026
Advertisement
దేవాలయాల సాక్షిగా, అమాయక ప్రజల ఆవేదన నడుమ ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న ఓ నిశ్శబ్ద పోరాటం ఇది. దాతృత్వం పేరిట విదేశాల నుంచి కుండపోతగా వచ్చిపడుతున్న వేల కోట్ల రూపాయలు నిజంగా పేదల కడుపు నింపుతున్నాయా? లేక దేశ అంతర్గత భద్రతను, పల్లెల్లోని ప్రశాంతతను చిన్నభిన్నం చేస్తున్నాయా? ఈ ప్రశ్న ప్రతి సగటు భారతీయుడి గుండెను తొలిచేస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణల దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న వేళ, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది. ఈ అంశాలపై టోన్ న్యూస్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు మన దేశంలో పురాతన కాలం నుంచి దానధర్మాలు, దాతృత్వానికి కొదవలేదు. అయితే ఈ ఆత్మీయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ నిధుల పేరుతో వికృత క్రీడ సాగుతోందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థల (NGOs) ఖాతాల్లోకి ప్రతిఏటా దాదాపు రూ. 23,000 కోట్ల భారీ నిధులు వచ్చి చేరుతున్నాయి. నిజానికి ఈ డబ్బుతో పేద పిల్లలకు ఉచిత విద్య, అనారోగ్యంతో బాధపడేవారికి మెరుగైన వైద్యం, పల్లెల్లో తాగునీటి సదుపాయాలు అందితే ఏ సమస్యా ఉండేది కాదు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆకలితో అల్లాడుతున్న నిరుపేదల బలహీనతలే పెట్టుబడిగా మారుతున్నాయి. ఊళ్లలో విదేశీ సొమ్ముతో నడుస్తున్న కొన్ని ముసుగు సంస్థలు.. ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. మాతృ సంస్కృతికి, పుట్టిన గడ్డకు ప్రజలను దూరం చేస్తూ, మత మార్పిడులు, శాంతిభద్రతల విచ్ఛిన్నానికి ఈ సొమ్ము దుర్వినియోగమవుతోందన్న ఆవేదన గ్రామీణుల్లో వెల్లువెత్తుతోంది. తమ కష్టాలను తీరుస్తారని నమ్మి వెళితే, తమ అస్తిత్వాన్నే బలికోరుతున్నారంటూ పలువురు బాధితులు విలపిస్తున్నారు. నిధుల దారి మళ్లింపు.. దేశ సమగ్రతకే ముప్పుకేవలం సామాజిక మార్పులకే కాదు, విదేశీ ధనం తీవ్రవాద కార్యకలాపాలకు, దేశ విచ్ఛిన్నకర శక్తులకు, చివరకు పొలిటికల్, రియల్ ఎస్టేట్ కరప్షన్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి సాధనంగా మారిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 16,200కు పైగా రిజిస్టర్డ్ సంస్థలకు విదేశీ నిధులు వస్తున్నప్పటికీ, అందులో అత్యధిక శాతం సంస్థలు పైసా పైసాకు తగిన లెక్కలు (అకౌంటబిలిటీ) చూపడంలో విఫలమవుతున్నాయి. ఎక్కడి నుంచి డబ్బు వస్తోంది? ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. చట్టం కఠినతరం కాకపోతే సామాన్యుడికి దక్కేదేంటి?విదేశీ నిధుల వినియోగాన్ని విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పర్యావరణం, సంస్కృతి, సహాయక చర్యలు, విశ్వాస ఆధారిత సంక్షేమం, శాస్త్రీయ పరిశోధనలు అనే స్పష్టమైన 9 విభాగాలకే పరిమితం చేస్తూ కేంద్రం తీసుకొస్తున్న కఠిన నిబంధనలు అత్యంత కీలకమైనవి. ఏటికేడు నిధుల లెక్కలు అడిగి, దుర్వినియోగానికి పాల్పడే వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏటా వచ్చే వేల కోట్ల రూపాయలు సరైన మార్గంలో ఖర్చు కాకపోతే, నిజంగా సాయం కోసం ఎదురుచూసే అనాథలు, రోగులు, నిరుపేద విద్యార్థులు శాశ్వతంగా అన్యాయానికి గురవుతారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంతో పాటు, అమాయకుల భవిష్యత్తును విదేశీ కుట్రల బారిన పడకుండా కాపాడుకోవడానికి ప్రతి పౌరుడూ ఈ నిధుల పారదర్శకతపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. FCRA Amendment Bill 2026, Foreign Contribution Act Telugu, NGO Foreign Funds India, PM Modi FCRA Bill, Foreign Donations Regulation Telugu. NGO Accounts Home Ministry, PM MODI, Amit shah
http://www.teluguone.com/news/content/fcra-amendment-bill-2026-36-228333.html





