అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై రేప్ కేసు..!
Publish Date:Aug 7, 2026
Advertisement
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు పలు తీవ్రమైన సెక్షన్లను నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు *బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 68, 64(2)(a)(m), 89, 74, 75, 77, 78, 115(2), 308, 351(3)*తో పాటు ఐటీ యాక్ట్‌లోని 66(E), 67, 67(A) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలపై శాఖాపరంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో క్రిమినల్ కేసు నమోదు కావడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు అనంతరం అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితు రాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు, ఘటనకు సంబంధించిన పరిస్థి తులు, ఆమె కు ఎదురైన ఇబ్బందులపై పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై నమోదు చేసిన సెక్షన్లకు సంబంధించిన అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా బాధితురాలు చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలు, డిజిటల్ కమ్యూనికేషన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలి స్టేట్‌మెంట్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. Rape case against Ameenpur Inspector Srinivasulu Reddy, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand
అవసరమైన సాంకేతిక ఆధారాలను కూడా సేకరించే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/rape-case-against-ameenpur-inspector-srinivasulu-reddy-36-228338.html





