నగర చాయ్‌కు కల్తీ నీడ…భారీ రైడ్స్‌లో నకిలీ టీ గ్యాంగ్ అరెస్ట్

Publish Date:Apr 23, 2026

Advertisement

 

చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు. అలాంటి నగరంలోనే ఇప్పుడు “నకిలీ చాయ్ పత్తా” కలకలం రేపింది. ఆహార కల్తీ నిఘా విభాగం పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో నకిలీ చాయ్ తయారీ ముఠా బండారం బయటపడింది. ఒకేసారి నగరంలోని 15 ప్రాంతాల్లో దాడులు జరిపిన హెచ్-పాస్ ప్రత్యేక బృందం, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న 10 మంది సభ్యులను అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి 4,000 కిలోల నకిలీ చాయ్ పత్త,1,500 కిలోల గడువు ముగిసిన టీ పొడి 100 కిలోల నకిలీ నల్ల బెల్లం స్వాధీనం చేసుకోవడం నగరంలో కల్తీ వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోందో చెబుతోంది.

10మంది కేటుగాళ్లు కలిసి తక్కువ నాణ్యత గల చాయ్ పత్తాలో సింథటిక్ రంగులు కలిపి, ఆకర్షణీయమైన రంగుతో “బ్రాండ్ టీ”లా మార్చి ప్రజలు విశ్వసించే ప్రముఖ బ్రాండ్ల పేర్లు ఉపయోగించి మార్కెట్లో దర్జాగా విక్రయిస్తు న్నారు..  
ఈ సింథటిక్ రంగులు స్వీట్లలో మాత్రమే పరిమితంగా వాడాలి. కానీ చాయ్ పత్తాలో ఉపయోగించడం వల్ల కడుపు నొప్పి, అలర్జీలు,జీర్ణ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నకిలీ టీ పౌడర్ ను ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తెచ్చి, నగరంలో ప్రాసెస్ చేసి మార్కెట్లోకి పంపుతున్నట్లు పోలీసులకు విశ్వాసనీయమైన సమాచారం రావడంతో దాడులు చేసి 10మంది కేటుగాళ్లు ను అదుపులోకి తీసుకున్నారు. 

కల్తీ ఆహార వ్యాపారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అధికారులు స్పష్టం చేశారు. కల్తీ తయారీ లేదా విక్రయం చేసిన వ్యాపారులపై ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అంతేకా కుండా వినియోగదారులు “చాయ్ కొనేటప్పుడు బ్రాండ్ నిజస్వరూపం, ప్యాకింగ్, వాసన, నాణ్యత తప్పనిసరిగా పరిశీలించాలి” అని అధికారులు సూచించారు...నగరానికి ఇష్టమైన చాయ్ కప్పులో ఇప్పుడు కల్తీ నీడ పడిన నేపథ్యంలో… వినియోగదారుల జాగ్రత్తే రక్షణ అని పోలీసులు చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.