నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి.. సీపీ సజ్జనార్

Publish Date:Aug 27, 2026

Advertisement

 

వైద్యం పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా కల్తీ ఆహారంపై ఇప్పటికే చర్యలు చేపడుతున్న హైదరాబాద్ పోలీసులు.. తాజాగా నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఎలాంటి విద్యార్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేకపోయినా కొందరు నకిలీ వైద్యులు అసలైన వైద్యుల మాదిరిగా నటిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. 

రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులను విచక్షణారహితంగా ఇవ్వడంతో పాటు ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ వారి ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా రోజుల తరబడి మందులు వాడాలని సూచించడం వల్ల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చికిత్స కోసం క్లినిక్ లేదా ఆసుపత్రికి వెళ్లే ముందు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. క్లినిక్ లేదా ఆసుపత్రి రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రదర్శించారో లేదో పరిశీలించాలని తెలిపారు. 

అలాగే వైద్యుల బోర్డులపై వారి పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. వైద్యుడి వివరాలపై అనుమానం ఉంటే onlinetsmc.in వెబ్‌సైట్‌లోని Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. అక్కడ వివరాలు కనిపించకపోతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై అనుమానం కలిగితే అర్హత కలిగిన మరో వైద్య నిపుణుడిని సంప్రదించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని సూచించారు.

నగరంలో ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీపీ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు. నకిలీ వైద్యులపై పోలీసుల నిఘా, కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

Fake Doctors Hyderabad, CP VC Sajjanar, DMHO, TSMC, CM Revanth reddy, Minister damodara,  
Telangana Health Department, Telugu News, Telugug One

By
en-us Political News

  
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.