ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్... బెంగాల్‌లో కమలం వికసించేనా?

Publish Date:Apr 29, 2026

Advertisement

 

దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది. ఈ క్రమంలో, ప్రముఖ సర్వే సంస్థ 'చాణక్య స్ట్రాటజీస్' వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల నాడిని ఈ సంస్థ అంచనా వేయగా, కొన్ని చోట్ల అధికార పక్షాలకే మొగ్గు ఉండగా, మరికొన్ని చోట్ల కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చినట్లు సర్వే చెబుతోంది. తాజా అంచనాల ప్రకారం, 150 నుంచి 160 స్థానాలతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ 130-140 స్థానాలకు పరిమితం కావచ్చు. ఓట్ల శాతంలోనూ కమలనాథులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తురని  చాణక్య స్ట్రాటజీస్ అంచన వేసింది.

దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో మాత్రం డీఎంకే నేతృత్వంలోని కూటమి హవా కొనసాగుతోంది. 145-160 స్థానాలతో స్టాలిన్ పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని సర్వే తేల్చి చెప్పింది. నటుడు విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ 'తమిళగ వెట్రి కళగం' కూడా గణనీయమైన ఓట్లు సాధించి, కొన్ని సీట్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

కేరళలో ఈసారి అధికార మార్పు తప్పదని సర్వే హెచ్చరిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 72-80 సీట్లతో విజయం సాధించనుండగా, ప్రస్తుత అధికార ఎల్డీఎఫ్ వెనుకబడే సూచనలు కనిపిస్తున్నాయి. అస్సాంలో మాత్రం సీఎం హిమంత బిశ్వ శర్మ చరిష్మా పనిచేయడంతో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 88-98 సీట్లతో ఘనవిజయం దిశగా సాగుతోంది.

పుదుచ్చేరిలో సైతం ఎన్డీయే కూటమి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, మ్యాజిక్ ఫిగర్ 16 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుని అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. విపక్ష కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, విజయం సాధించడంలో విఫలమవుతుందని సర్వే వెల్లడించింది.

ఈ సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకుల్లో వేడిని పెంచాయి. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని, అసలైన ప్రజా తీర్పు మే 4న వెలువడే ఫలితాల్లోనే బయటపడుతుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలుసుకోవడానికి మరో కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్‌ పోల్స్‌.

బీజేపీ 150-160, TMC 130-140, INC-2-4, ఇతర పార్టీలు 4-6 
తమిళనాట (234) డీఎంకే కూటమి 145-160, AIADMK 50-65, TVK 13-18, ఇతర పార్టీలు 5-8 సీట్లు 


 పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.
తమిళనాడు (234): డీఎంకే 125-146,ఏడీఏఎంకే 65-80 
టీవీకే 18-24, ఇతరులు 2-6
కేరళం (140): ఎల్‌డీఏఫ్‌ 55-65, యూడీఎఫ్‌ 75-85, ఎన్‌డీఏ 0-3
అసోం (126): బీజేపీ 68-72, కాంగ్రెస్‌ 22-26,ఏజీపీ 7-10, బీపీఎఫ్‌ 8-9

తమిళనాడు (మొత్తం: 234)
ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

డీఎంకే: 125 – 145
ఏడీఎఎంకే: 65 – 80
టీవీకే (విజయ్): 18 – 24
ఇతరులు : 2 – 6

కేరళ (మొత్తం: 140)
ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

యూడీఎఫ్‌: 75 – 85
ఎల్‌డీఎఫ్‌: 55 – 65
బీజేపీ: 0 – 3
ఇతరులు : 0

అసోం (మొత్తం: 126)
ఏజెన్సీ: యాక్సిస్‌ మై ఇండియా

బీజేపీ: 88 – 101
కాంగ్రెస్‌: 15 – 36
ఏఐయూడీఎఫ్‌: 0
ఇతరులు: 0 – 3

పశ్చిమ బెంగాల్ (మొత్తం: 294)
ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

టీఎంసీ: 177 – 187
బీజేపీ: 95 – 110
కాంగ్రెస్‌: 1 – 3
వాపక్షాలు: 0 – 1

పుదుచ్చేరి (మొత్తం: 30)
ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

ఎన్‌ఆర్‌సీ: 16 – 19
కాంగ్రెస్‌: 10 – 12
ఇతరులు: 1 – 2

By
en-us Political News

  
న్యాయపరంగా ఈ కేసులో ఊరట పొందేందుకు పూడి శ్రీహరి ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాల్లో ఆయనకు చుక్కెదురైంది. తన అరెస్టును ఆపాలంటూ ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, లేదా స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించడంతో.. పోలీసులకు ఆయనను అరెస్ట్ చేసేందుకు మార్గం సుగమమైంది.
అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు ఖ్యాతి పెరుగుతోందన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు మద్దతుగా బలమైన ప్రపంచ అనుసంధానం అవసరమన్నారు భారత ఆరోగ్య సంరక్షణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పినందుకు ముఖ్యమంత్రి అపోలో ఆసుపత్రులను అభినందించారు.
983లో రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించిన జి.ఎన్. నాయుడు, దేశ సెరామిక్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అతివేగంగా దూసుకొచ్చిన ఒక పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, మందుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా తీసుకురాబోయే ఆరోగ్య పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది.
ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తూ ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటింది.  కీలకమైన ఈ పోరులో సన్‌రైజర్స్ బ్యాటర్లు విరుచుకుపడి భారీ లక్ష్యాన్ని ఛేదించారు.
బెంగళూరు నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.