డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్ : సీఎం చంద్రబాబు

Publish Date:Apr 29, 2026

Advertisement

 

ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని  సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందిస్తున్నామని తెలిపారు.  వాట్సప్ గవర్నెన్సు సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 

వాట్సప్ గవర్నెన్స్ సేవల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఎంకు తెలిపారు. ఇప్పటి వరకూ 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్సు సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించామని చెప్పారు.  కర్నూలు జిల్లాలో ఏర్నాటు చేస్తున్న డ్రోన్ సిటీ ఫేజ్ 1 అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని... ఇప్పటికే ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యిందని, మే నెల రెండో వారంలో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యిందని అధికారులు ఇచ్చిన వివరణ పై స్పందించిన సీఎం... ఈ ఏడాది జూలై నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.  

సీసీ కెమేరాలతో నేర నియంత్రణ చర్యలు

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో సీసీ టీవీ కెమేరాల ఏర్పాటు, వాటి వినియోగం, పర్యవేక్షణ జరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడంతో పాటు... మిస్సింగ్ కేసుల ట్రేసింగ్, వాహనాల దొంగతనాల వంటి కేసులు వేగంగా కొలిక్కి వస్తున్నాయని చెప్పారు. అయితే సీసీ కెమేరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 

సీసీ కెమేరాలతో పాటు శాటిలైట్ డేటాను వినియోగించు కునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారుకు సీఎం నిర్దేశించారు. శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అనుసంధానించి వేగంగా చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఇటీవల తిరుమల-తిరుపతి సమీపంలో శేషాచల అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించిన ఘటనపై వేగంగా స్పందించే అవకాశం ఉండేదన్నారు. డీజిల్, పెట్రోలు సరఫరా పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలతో మళ్లీ సాధారణ స్థితికి నెలకొందని... అయితే సమస్య ఉత్పన్నం కాకముందే రియల్ టైమ్‌లో  స్పందించేలా చర్యలు ఉండాలని సీఎం సూచించారు.

By
en-us Political News

  
కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
ఇటీవల ఒక ప్రత్యేక సందర్భంలో వీరిద్దరూ కలిసినప్పుడు, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా హుందాగా, ఆత్మీయంగా సాగింది. సచిన్ టెండూల్కర్ క్రీడా రంగానికి చేసిన సేవలను కొనియాడుతూనే.. వ్యక్తిగతంగా ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని లోకేష్ చాటుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రముఖులతో కలిసినప్పుడు అది కేవలం ఒక ఫోటో షూట్‌కో లేదా మర్యాదపూర్వక భేటీకో పరిమితం అవుతుంది. కానీ లోకేష్, సచిన్ విషయంలో మాత్రం వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, ఉమ్మడి అభిరుచులు వారి సంభాషణలో ప్రతిబింబించాయి.
భారతీయ మూలాలను కలిగిన మమ్దానీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
ట్రాఫిక్ బూత్ లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఎండల తీవ్రత దృష్ట్యా ఉపశమనం పొందేందుకు జిల్లా ఎస్పీ చోరవతో చల్లటి నీటి తుంపరలను చల్లే ఫ్యాన్ లు ఏర్పాటు చేశారు.
గత ఏడాది చైతన్యపురిలో వెలుగులోకి వచ్చిన కేసులో మురుగన్ పేరు మొదట బయటపడింది. ఆ సమయంలో మూడు నెలలు జైల్లో గడిపి బయటకు వచ్చిన అతను మళ్లీ అక్రమ కార్యక లాపాలను కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట ఇది సాధారణ ఆత్మహత్యగా పోలీసులు భావించారు. అయితే ఆ తరువాత లభించిన 19 పేజీల సూసైడ్ నోట్ కేసు దిశను పూర్తిగా మార్చింది. సీతారాం ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన సూసైడ్ నోట్ లో సీతారాం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న మానసిక వేదనను వివరంగా పేర్కొన్నాడు.
అయితే ఇప్పుడు వేదిక మారింది. అవే తేదీలలో పార్టీ పండుగ మహానాడును నెల్లూరు జిల్లాలో జరపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయకారణాలే కాకుండా.. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
పోలీస్-ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై వచ్చిన అభిప్రాయాల మార్పు కోసం చర్యలు తీసుకున్నామన్నారు.
న్యాయపరంగా ఈ కేసులో ఊరట పొందేందుకు పూడి శ్రీహరి ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాల్లో ఆయనకు చుక్కెదురైంది. తన అరెస్టును ఆపాలంటూ ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, లేదా స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించడంతో.. పోలీసులకు ఆయనను అరెస్ట్ చేసేందుకు మార్గం సుగమమైంది.
అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు ఖ్యాతి పెరుగుతోందన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు మద్దతుగా బలమైన ప్రపంచ అనుసంధానం అవసరమన్నారు భారత ఆరోగ్య సంరక్షణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పినందుకు ముఖ్యమంత్రి అపోలో ఆసుపత్రులను అభినందించారు.
983లో రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించిన జి.ఎన్. నాయుడు, దేశ సెరామిక్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అతివేగంగా దూసుకొచ్చిన ఒక పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, మందుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా తీసుకురాబోయే ఆరోగ్య పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.